కోహ్లికి చెందిన పబ్‌పై కేసు

భారత స్టార్‌ బ్యాటర్‌ విరాట్ కోహ్లికి చెందిన ‘వన్‌ 8 కమ్యూన్‌ పబ్‌’పై బెంగళూరులో కేసు నమోదైంది.

Published : 10 Jul 2024 03:22 IST

బెంగళూరు (శివాజీనగర), న్యూస్‌టుడే: భారత స్టార్‌ బ్యాటర్‌ విరాట్ కోహ్లికి చెందిన ‘వన్‌ 8 కమ్యూన్‌ పబ్‌’పై బెంగళూరులో కేసు నమోదైంది. చిన్నస్వామి క్రికెట్ మైదానం ఎదురుగా ఉన్న భవంతి పైఅంతస్తులో ఉన్న ఈ పబ్‌ అర్ధరాత్రి దాటి 1.30 వరకు తెరచి ఉంచుతున్నారని వచ్చిన ఫిర్యాదులతో కబ్బన్‌పార్కు ఠాణాలో ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. ఇదే తరహాలో    చర్చి వీధిలోని ఎంపైర్‌ రెస్టారెంటు, బ్రిగేడ్‌ రోడ్డులోని మరో బార్‌పైనా పోలీసులు కేసులు నమోదు చేశారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని