అంతరిక్ష దినోత్సవానికి ఇస్రో సన్నాహాలు

జాతీయ అంతరిక్ష దినోత్సవ నిర్వహణకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) సన్నాహాలు చేస్తోంది.

Published : 10 Jul 2024 03:22 IST

శ్రీహరికోట, న్యూస్‌టుడే: జాతీయ అంతరిక్ష దినోత్సవ నిర్వహణకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా నెలరోజులపాటు ప్రత్యేక కార్యక్రమాల్ని నిర్వహించనుంది. ఇస్రో గతేడాది జులై 14న శ్రీహరికోట నుంచి ఎల్‌వీఎం3-ఎం4 వాహకనౌక ద్వారా చంద్రయాన్‌-3 ప్రయోగం చేపట్టింది. అదే ఏడాది ఆగస్టు 23న చంద్రునిపై ల్యాండర్‌ దిగింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని అప్పట్లో ప్రధాని నరేంద్రమోదీ ఏటా ఆగస్టు 23న జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఈ నెల 15 నుంచి వచ్చే నెల 15 వరకు దేశవ్యాప్తంగా వివిధ కార్యక్రమాలు చేపట్టనున్నారు. అంతరిక్ష ప్రదర్శనలు, ఉపన్యాసాలు, అంతరిక్ష ప్రయోగాలు, వాటి ప్రయోజనాలు, విద్యార్థులకు సెమినార్లు, వివిధ పోటీలు నిర్వహించనున్నారు. ఆగస్టు 23న ముగింపు కార్యక్రమం దిల్లీలో ఉంటుంది.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని