దివ్యాంగుల చట్టం అమలులో వైఫల్యంపై సుప్రీం ఆగ్రహం

సివిల్‌ సర్వీస్‌ పరీక్ష (2008)లో అర్హత సాధించిన 100శాతం కంటి చూపులేని దివ్యాంగుడికి మూడు నెలల్లోగా నియామక ఉత్తర్వులివ్వాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.

Published : 10 Jul 2024 04:35 IST

దిల్లీ: సివిల్‌ సర్వీస్‌ పరీక్ష (2008)లో అర్హత సాధించిన 100శాతం కంటి చూపులేని దివ్యాంగుడికి మూడు నెలల్లోగా నియామక ఉత్తర్వులివ్వాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. దివ్యాంగుల చట్టం(1995)లోని నిబంధనల ప్రకారం వారి కోటా రిజర్వేషన్ల అమలులో వైఫల్యానికి గాను కేంద్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంటనే బ్యాక్‌లాగ్‌ పోస్టులను భర్తీ చేయాలని జస్టిస్‌ అభయ్‌ ఎస్‌.ఓక్, జస్టిస్‌ పంకజ్‌ మిత్తల్‌ సభ్యులుగా ఉన్న ధర్మాసనం స్పష్టం చేసింది.సివిల్‌ సర్వీస్‌ పరీక్ష (2008)కు సంబంధించిన రాత పరీక్ష, ఇంటర్వ్యూలో అర్హత సాధించినప్పటికీ నియామక ఉత్తర్వు రాకపోవడంతో పంకజ్‌ కుమార్‌ శ్రీవాస్తవ అనే దివ్యాంగుడు న్యాయపోరాటం ప్రారంభించారు. కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్, దిల్లీ హైకోర్టు అతనికి అనుకూలంగా ఉత్తర్వులిచ్చినప్పటికీ దివ్యాంగుల (అంధత్వ) కేటగిరి-6లో ఖాళీలు లేవంటూ యూపీఎస్‌సీ సమాధానమిస్తూ వచ్చింది. దిల్లీ హైకోర్టు ఆదేశాలను సవాల్‌ చేస్తూ కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీలు చేయగా తాజా ఆదేశాలు వెలువడ్డాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు