రెండేళ్లలో కొత్తగా 10వేల నాన్‌-ఏసీ రైలు పెట్టెలు

రెండేళ్లలో సుమారు 10 వేల నాన్‌-ఏసీ రైలు పెట్టెలను తయారు చేయబోతున్నట్లు రైల్వే శాఖ తెలిపింది. దీనివల్ల మొత్తం నాన్‌-ఏసీ కోచ్‌ల సంఖ్య 22% మేర పెరగనుంది.

Updated : 10 Jul 2024 04:45 IST

దిల్లీ: రెండేళ్లలో సుమారు 10 వేల నాన్‌-ఏసీ రైలు పెట్టెలను తయారు చేయబోతున్నట్లు రైల్వే శాఖ తెలిపింది. దీనివల్ల మొత్తం నాన్‌-ఏసీ కోచ్‌ల సంఖ్య 22% మేర పెరగనుంది. సామాన్యులకు ప్రయోజనం కలిగించేలా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. 

ప్రయాణికుల సౌకర్యాలు మెరుగుపరచడానికి అమృత్‌భారత్‌ రైళ్లలో అవసరమైన సాధారణ, స్లీపర్‌ రైలుపెట్టెలు ఈ ఏడాది తయారు కానున్నాయి. 2024-25లో ‘ఎక్కువ సామర్థ్యం ఉన్న పార్శిల్‌ వ్యాన్లు’ 32, ప్యాంట్రీకార్లు 55 చొప్పున ఉత్పత్తి చేస్తారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఇవి వరసగా 200, 110 చొప్పున ఉంటాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని