రెండు రాష్ట్రాల్లో మినహా ఉప ఎన్నికలు ప్రశాంతం

దేశంలో ఏడు రాష్ట్రాల్లో ఖాళీ అయిన 13 శాసనసభ స్థానాలకు బుధవారం నిర్వహించిన ఉప ఎన్నికలు ఉత్తరాఖండ్, పశ్చిమబెంగాల్‌లలో మినహా మిగతాచోట్ల ప్రశాంతంగా పూర్తయ్యాయి.

Published : 11 Jul 2024 02:26 IST

దిల్లీ: దేశంలో ఏడు రాష్ట్రాల్లో ఖాళీ అయిన 13 శాసనసభ స్థానాలకు బుధవారం నిర్వహించిన ఉప ఎన్నికలు ఉత్తరాఖండ్, పశ్చిమబెంగాల్‌లలో మినహా మిగతాచోట్ల ప్రశాంతంగా పూర్తయ్యాయి. కొన్నిస్థానాల్లో ఒక మోస్తరుగా, మిగిలినచోట్ల ముమ్మరంగా పోలింగ్‌ నమోదైంది. ఉత్తరాఖండ్‌లోని మంగలౌర్‌ నియోజకవర్గంలో ప్రత్యర్థి పార్టీల మధ్య ఘర్షణలో ఒక బూత్‌ వద్ద కాల్పులు జరిగినట్లు ప్రచారం జరిగింది. పోలీసులు దానిని తోసిపుచ్చారు. రక్తంతో తడిచిన దుస్తులతో ఉన్న ఒక కార్యకర్తను అక్కడి కాంగ్రెస్‌ అభ్యర్థి ఆసుపత్రికి తీసుకువెళ్తున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వెలుగుచూశాయి. ముఖానికి ముసుగులు ధరించిన కొందరు వ్యక్తులు పోలింగ్‌బూత్‌ లోపలకు ప్రవేశించి, ఎవరూ ఓట్లు వేయకుండా అడ్డుకోవడంతో హింస చెలరేగింది. తమ బూత్‌ ఏజెంట్లపై తృణమూల్‌ కార్యకర్తలు దాడులు చేస్తున్నారని, కొన్ని పోలింగ్‌ కేంద్రాలను సందర్శించనివ్వకుండా అభ్యర్థుల్ని అడ్డుకుంటున్నారని భాజపా నేతలు ఆరోపించారు. పంజాబ్‌లో ఓటువేసిన ఓటర్లకు మొక్కల్ని అందించారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని