కేసు ఉపసంహరణకు రూ.50 లక్షలు డిమాండ్‌

కేసు ఉపసంహరించుకొనేందుకు ప్రతివాదుల నుంచి డబ్బు తీసుకోవడానికి యత్నించిన ఓ పిటిషనర్‌పై దిల్లీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు సమయం ముగిసేవరకూ అతడు అక్కడే కూర్చోవాలని ఆదేశించింది.

Published : 11 Jul 2024 03:40 IST

పిటిషనర్‌పై దిల్లీ హైకోర్టు ఆగ్రహం
రూ.లక్ష డిపాజిట్‌ చేసి, కోర్టులోనే కూర్చోవాలంటూ ఆదేశం 

దిల్లీ: కేసు ఉపసంహరించుకొనేందుకు ప్రతివాదుల నుంచి డబ్బు తీసుకోవడానికి యత్నించిన ఓ పిటిషనర్‌పై దిల్లీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు సమయం ముగిసేవరకూ అతడు అక్కడే కూర్చోవాలని ఆదేశించింది. దీంతోపాటు దిల్లీ హైకోర్టు న్యాయసేవల కమిటీ ఖాతాలో రూ.లక్ష డిపాజిట్‌ చేయాలని పేర్కొంది. కోర్టు ధిక్కరణ చర్యల కింద  జస్టిస్‌ ప్రతిభ ఎం సింగ్, జస్టిస్‌ అమిత్‌ శర్మలతో కూడిన ధర్మాసనం ఈ శిక్ష విధించింది. ఇక్కడి బురారీలో ఉన్న స్థలంలో అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ 62 ఏళ్ల వ్యక్తి 2021లో న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అనంతరం ఆయన తన పిటిషన్‌ను వెనక్కు తీసుకోవడానికి ప్రతివాదుల నుంచి రూ.50 లక్షల నగదు డిమాండ్‌ చేస్తున్నట్లు తెలుసుకున్న కోర్టు ఈ మేరకు పిటిషనర్‌కు శిక్ష విధించింది. పిటిషనర్‌ వయసు, ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని స్వల్ప శిక్షతో సరిపెట్టినట్లు స్పష్టం చేసింది. 

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని