అనాథ యువతి దత్తత.. పెళ్లిపల్లకీ మోసిన పోలీసులు

ఉత్తరాఖండ్‌లోని పిథౌరాగఢ్‌కు చెందిన ఓ పోలీసు ఇన్‌స్పెక్టర్‌ అనాథ యువతిని దత్తత తీసుకొని ఘనంగా పెళ్లి చేశారు.

Published : 11 Jul 2024 05:49 IST

ఈటీవీ భారత్‌: ఉత్తరాఖండ్‌లోని పిథౌరాగఢ్‌కు చెందిన ఓ పోలీసు ఇన్‌స్పెక్టర్‌ అనాథ యువతిని దత్తత తీసుకొని ఘనంగా పెళ్లి చేశారు. తోటి పోలీసు సిబ్బంది ఆయనకు సాయం చేశారు. ఆమె పెళ్లికి ఆర్థికంగా అండగా నిలిచి, సొంత సోదురుల్లా పెళ్లికుమార్తె పల్లకీని మోశారు. ధార్చుల గ్రామానికి చెందిన పుష్ప తల్లిదండ్రులు చిన్నప్పుడే మరణించడంతో అమ్మమ్మ పెంచింది. ఆమె కూడా పదేళ్ల క్రితం తుదిశ్వాస విడిచింది. అనాథగా మారిన పుష్ప పొట్టకూటి కోసం పని వెదుక్కొంటూ పిథౌరాగఢ్‌కు చేరింది. స్థానికంగా ఉన్న ఓ దేవాలయం వద్ద ఉన్న పుష్పను అటుగా వెళ్తున్న పిథౌరాగఢ్‌ పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ నరేశ్‌ చంద్ర జఖ్మోలా  చూశారు. వివరాలు ఆరా తీసిన ఆయన ఉన్నతాధికారుల అనుమతితో ఆమెను దత్తత తీసుకొని పెంచారు. సమీపంలోని థల్‌ పట్టణానికి చెందిన విపిన్‌తో పుష్ప పెళ్లిని ఇటీవల నిశ్చయించారు. పోలీస్‌ లైన్స్‌లోని గౌరీ హాల్‌ ఆడిటోరియంలో ఈ పెళ్లి వేడుక ఘనంగా జరిగింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని