నీట్‌ (యూజీ)లో మాల్‌ ప్రాక్టీస్‌ జరగలేదు: కేంద్రం

నీట్‌ (యూజీ)లో మాల్‌ ప్రాక్టీస్‌ జరిగిందనడానికిగానీ, కొన్ని కేంద్రాల్లో విద్యార్థులు లబ్ధి పొందేలా అక్రమాలు జరిగాయనడానికిగానీ ఆధారాల్లేవని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.

Published : 11 Jul 2024 03:43 IST

దిల్లీ: నీట్‌ (యూజీ)లో మాల్‌ ప్రాక్టీస్‌ జరిగిందనడానికిగానీ, కొన్ని కేంద్రాల్లో విద్యార్థులు లబ్ధి పొందేలా అక్రమాలు జరిగాయనడానికిగానీ ఆధారాల్లేవని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. మద్రాస్‌ ఐఐటీ నిర్వహించిన ఈ పరీక్షల ఫలితాల డేటా విశ్లేషణలో.. మార్కుల పంపిణీలో అసాధారణ అంశాలేవీ కనిపించలేదని పేర్కొంది. మార్కులు సాధారణంగానే ఉన్నాయని బుధవారం సుప్రీంకోర్టుకు సమర్పించిన అదనపు అఫిడవిట్‌లో కేంద్రం వివరించింది. నీట్‌(యూజీ)పై గురువారం సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరపనుంది. ఈ నేపథ్యంలో కేంద్రం ఈ అఫిడవిట్‌ సమర్పించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని