17న పీఎస్‌ఎల్‌వీ ప్రయోగం
వాతావరణ పరిస్థితులన్నీ అనుకూలిస్తే.. భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రమైన శ్రీహరికోట నుంచి ఈ నెల 17న పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్-సి50 (పీఎస్‌ఎల్‌వీ) ప్రయోగాన్ని
శ్రీహరికోట, న్యూస్‌టుడే: వాతావరణ పరిస్థితులన్నీ అనుకూలిస్తే.. భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రమైన శ్రీహరికోట నుంచి ఈ నెల 17న పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్-సి50 (పీఎస్‌ఎల్‌వీ) ప్రయోగాన్ని చేయాలని శాస్త్రవేత్తలు లక్ష్యంగా పెట్టుకున్నారు. వరుస తుపాన్ల నేపథ్యంలో ప్రయోగాన్ని వాయిదా వేస్తూ వస్తున్నారు. తొలుత ఈ నెల 2న పీఎస్‌ఎల్‌వీ-సి50 వాహక నౌకను అనుసంధాన భవనం నుంచి రెండో ప్రయోగ వేదికకు తీసుకొచ్చి, 7న ప్రయోగం చేయాలని శాస్త్రవేత్తలు నిర్ణయించారు. ఈ నెలలో 8వ తేదీ వరకు వరుస తుపాన్లు ఉండటంతో ప్రయోగాన్ని వాయిదా వేశారు. తర్వాత ఈ నెల 14న ప్రయోగం చేయాలని భావించారు. ఐదు రోజులపాటు వాహకనౌకను ప్రయోగవేదికపై ఉంచి వివిధ పనులు చేయాలి. ఈ సమయంలో తుపాన్లు, వర్షాలు పడే అవకాశం ఉండటంతో 14న ప్రయోగం చేయడం వీలుపడదని భావించి 17వ తేదీకి వాయిదా వేశారు. దీనిద్వారా మనదేశానికి చెందిన సీఎంఎస్-01 ఉపగ్రహాన్ని నిర్ణీత కక్ష్యలో ప్రవేశ పెట్టనున్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Ts-top-news News
రంగంలోకి కేంద్ర నిఘా సంస్థ.. డేటా లీకేజీ వ్యవహారంలో మలుపులు
-
Crime News
కారుపై ‘పొక్లెయిన్’ పిడుగు!.. ముగ్గురి దుర్మరణం.. ఇద్దరికి తీవ్రగాయాలు
-
Ap-top-news News
పాపికొండల విహారయాత్రకు పచ్చ జెండా
-
Politics News
‘వచ్చే ఎన్నికల్లో వైకాపాకు ఓటేయం’.. ఎచ్చెర్ల ఎమ్మెల్యేకు తేల్చిచెప్పిన వైకాపా కార్యకర్తలు
-
Sports News
భారత్తో బంధం ప్రత్యేకమైంది: ఏబీ డివిలియర్స్
-
Ap-top-news News
సీఎం జగన్ కోసం 2 గంటలు వాహనాల మళ్లింపు