‘క్యాపిటల్‌’పై దాడిని ఖండించిన ఇండియన్‌-అమెరికన్లు

క్యాపిటల్‌ భవనంపై ట్రంప్‌ అనుయాయులు చేసిన దాడిని ఇండియన్‌-అమెరికన్లు ఖండించారు. ఇందుకు ట్రంపే బాధ్యత వహించాల్సి ఉంటుందని బైడెన్‌ ప్రచార కమిటీలో ఆర్థిక విభాగం

Published : 09 Jan 2021 05:58 IST

వాషింగ్టన్‌: క్యాపిటల్‌ భవనంపై ట్రంప్‌ అనుయాయులు చేసిన దాడిని ఇండియన్‌-అమెరికన్లు ఖండించారు. ఇందుకు ట్రంపే బాధ్యత వహించాల్సి ఉంటుందని బైడెన్‌ ప్రచార కమిటీలో ఆర్థిక విభాగం సభ్యునిగా పనిచేసిన అజయ్‌ భుటోరియా అన్నారు. ఎన్నికల ఫలితాలను తారుమారు చేయాలన్న దురుద్దేశంతో తీవ్రవాదులు ఈ దాడి చేశారని సిఖ్‌ అమెరికన్‌ లీగల్‌ డిఫెన్స్‌, ఎడ్యుకేషన్‌ ఫండ్‌ డైరెక్టర్‌ కిరణ్‌ కౌర్‌ గిల్‌ ఆరోపించారు. ఈ దాడిని హిందు అమెరికన్‌ ఫౌండేషన్‌ కూడా ఖండించింది. ఇప్పటికైనా ట్రంప్‌ ప్రమాదకరమైన అబద్ధాలు చెప్పడం మానుకోవాలని ఐరాస మానవ హక్కుల సంఘం హైకమిషనర్‌ మిషల్లే బాషెలెట్‌ సూచించారు. దాడులపై ఐరాస సెక్రటరీ జనరల్‌ గుటెరస్‌ విచారం వ్యక్తం చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని