చర్చలతో స్నేహపూర్వక పరిష్కారం

తూర్పు లద్దాఖ్‌లో భారత్‌, చైనాల మధ్య నెలకొన్న ప్రతిష్టంభనకు చర్చల ద్వారా స్నేహపూర్వక పరిష్కారం లభిస్తుందని సైన్యాధిపతి జనరల్‌ ఎంఎం నరవణె

Published : 13 Jan 2021 04:28 IST

  చైనాతో ప్రతిష్టంభనపై సైన్యాధిపతి నరవణె వ్యాఖ్య

దిల్లీ: తూర్పు లద్దాఖ్‌లో భారత్‌, చైనాల మధ్య నెలకొన్న ప్రతిష్టంభనకు చర్చల ద్వారా స్నేహపూర్వక పరిష్కారం లభిస్తుందని సైన్యాధిపతి జనరల్‌ ఎంఎం నరవణె విశ్వాసం వ్యక్తం చేశారు. ‘పరస్పర, సమాన భద్రత’ సూత్రం ఆధారంగా చర్చలు సాగితే అది సాధ్యమన్నారు. జాతీయ లక్ష్యాలను సాధించేవరకూ సైన్యం సరిహద్దుల నుంచి వెనక్కి తగ్గదని ఉద్ఘాటించారు. ఈనెల 15న సైనిక దినోత్సవం సందర్భంగా దిల్లీలో మంగళవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గతేడాది జరిగిన పరిణామాల నేపథ్యంలో చైనా సరిహద్దు వెంబడి మన దళాలను పునర్వ్యవస్థీకరించడానికి చర్యలు తీసుకున్నామని నరవణె చెప్పారు. తూర్పు లద్దాఖ్‌లో గతేడాది ఉన్న పరిస్థితే ఇప్పటికీ కొనసాగుతోందన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని