నేటి నుంచి పార్లమెంటు భేటీ

పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాల రెండో భాగం సోమవారం ప్రారంభం కానుంది. నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంత అసెంబ్లీలకు ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఈ సమావేశాలకు ప్రాధాన్యం ఏర్పడింది. ఏప్రిల్‌ ఎనిమిదో తేదీ వరకు సుమారు నెల రోజుల పాటు ఈ సమావేశాలు జరగాల్సి ఉండగా,

Published : 08 Mar 2021 04:36 IST

కీలక బిల్లులు సభ ముందుకు
రెండు వారాలకు  సమావేశాల కుదింపు?

దిల్లీ: పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాల రెండో భాగం సోమవారం ప్రారంభం కానుంది. నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంత అసెంబ్లీలకు ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఈ సమావేశాలకు ప్రాధాన్యం ఏర్పడింది. ఏప్రిల్‌ ఎనిమిదో తేదీ వరకు సుమారు నెల రోజుల పాటు ఈ సమావేశాలు జరగాల్సి ఉండగా, ఎన్నికల దృష్ట్యా రెండు వారాలకే కుదించే అవకాశం ఉంది. అన్ని పార్టీలూ ఇందుకు సుముఖంగా ఉండడంతో ప్రారంభం రోజునే దీనిపై ప్రకటన వెలువడే సూచనలు ఉన్నాయి. కరోనా దృష్ట్యా ఇంతవరకు రాజ్యసభను ఉదయం పూట, లోక్‌సభను సాయంత్రం నిర్వహించగా ఇప్పుడు రెండు సభలనూ ఉదయం 11 గంటలకే ప్రారంభించనున్నారు. ఈ సమావేశాల్లో పింఛను నిధి నియంత్రణ-అభివృద్ధి ప్రాధికారిక సంస్థ సవరణ బిల్లు; మౌలిక వసతుల కల్పనకు నిధులు సమకూర్చే జాతీయ బ్యాంకు బిల్లు, విద్యుత్తు సవరణ బిల్లు; క్రిప్టో కరెన్సీ, అధికారిక డిజిటల్‌ కరెన్సీ నియంత్రణ బిల్లులు సభ పరిశీలనలోకి రానున్నాయి. ఎన్నికల దృష్ట్యా వివిధ పార్టీల సీనియర్‌ నాయకులు ఈ సమావేశాలకు హాజరయ్యే సూచనలు కనిపించడం లేదు.

వ్యూహంపై చర్చించిన సోనియా
సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ భేటీ అయింది. సోనియా గాంధీ అధ్యక్షతన వర్చువల్‌ విధానంలో ఈ సమావేశం జరిగింది. వ్యూహంపై పార్టీ అధినేత్రి సోనియాగాంధీ చర్చించారు. వ్యవసాయ చట్టాలు, ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణ, పెట్రోల్‌ ధరల పెరుగుదల, సామాజిక మాధ్యమాలపై విధించిన నిబంధనల గురించి ప్రశ్నించనున్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్‌ అసంతృప్త జీ-23 నాయకులు ఆనంద్‌ శర్మ, మనోజ్‌ తివారీలు కూడా పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని