యూఎస్‌ క్యాపిటల్‌ సమీపంలోకి దూసుకొచ్చిన కారు

అమెరికా రాజధాని వాషింగ్టన్‌లోని క్యాపిటల్‌ భవనం వద్ద మరోసారి కలకలం రేగింది. అక్కడ వేగంగా దూసుకొచ్చిన ఒక కారు.. భవనం వద్ద ఉన్న బ్యారికేడ్‌ను బలంగా ఢీ కొట్టింది. దీంతో ఇద్దరు పోలీసు అధికారులు గాయపడ్డారు. వీరిలో ఒకరు మరణించినట్లు అధికారులు చెప్పారు.

Updated : 03 Apr 2021 12:11 IST

పోలీసు అధికారి మృతి.. నిందితుడి కాల్చివేత  

వాషింగ్టన్‌: అమెరికా రాజధాని వాషింగ్టన్‌లోని క్యాపిటల్‌ భవనం వద్ద మరోసారి కలకలం రేగింది. అక్కడ వేగంగా దూసుకొచ్చిన ఒక కారు.. భవనం వద్ద ఉన్న బ్యారికేడ్‌ను బలంగా ఢీ కొట్టింది. దీంతో ఇద్దరు పోలీసు అధికారులు గాయపడ్డారు. వీరిలో ఒకరు మరణించినట్లు అధికారులు చెప్పారు. అనంతరం కారు డ్రైవర్‌ను  భద్రతా సిబ్బంది కాల్చి చంపారు. నిందితుడి వద్ద కత్తి ఉన్నట్లు సమాచారం. క్యాపిటల్‌ భవనం వెలుపల ఉన్న ఒక చెక్‌పోస్టు వద్ద ఈ ఘటన జరిగిందని అధికారులు తెలిపారు. ఆ సమయంలో అమెరికా కాంగ్రెస్‌ సమావేశంలో లేదు. కాల్పుల నేపథ్యంలో ఆ ప్రాంతం మొత్తాన్నీ భద్రతా సిబ్బంది దిగ్బంధం చేశారు. ఈ ఘటన వెనుక ఉగ్ర కోణాన్ని అధికారులు కొట్టివేశారు. దేశాధ్యక్షుడిగా జో బైడెన్‌ విజయాన్ని ధ్రువీకరించేందుకు అమెరికా కాంగ్రెస్‌ ఓటింగ్‌ నిర్వహిస్తున్న సమయంలోనూ ఆందోళనకారులు ఈ భవనంలోకి చొచ్చుకొచ్చిన సంగతి తెలిసిందే.Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని