Published : 17 Apr 2021 04:57 IST

అణుబాంబు దిశగా ఇరాన్‌ అడుగులు!

టెహ్రాన్‌: అంతర్జాతీయ ఒత్తిళ్లను బేఖాతరు చేస్తూ ఇరాన్‌ తన అణు కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళుతోంది. యురేనియాన్ని 60 శాతం మేర శుద్ధి చేసే కసరత్తును శుక్రవారం ప్రారంభించినట్లు ప్రకటించింది. తద్వారా అణ్వస్త్రం దిశగా ముందడుగు వేసినట్లయింది. నతాంజ్‌లోని తన అణు కర్మాగారంపై సైబర్‌ దాడి జరిగిన నేపథ్యంలో ఈ వివాదాస్పద నిర్ణయాన్ని తీసుకుంది. ఫలితంగా పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తారస్థాయికి చేరే ప్రమాదం ఉంది. యురేనియం శుద్ధి స్థాయిని పెంచుతున్నట్లు ఇరాన్‌ పార్లమెంటు స్పీకర్‌ మహ్మద్‌ బాగేర్‌ ఖాలిబాఫ్‌ ప్రకటించారు.

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని