17 దేశాల్లో భారత్‌ రకం కరోనా

భారత్‌ రకంగా పిలుస్తున్న ‘బి.1.617’ కరోనా వైరస్‌ను ఇప్పటివరకు 17 దేశాల్లో గుర్తించినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) వెల్లడించింది.

Updated : 29 Apr 2021 12:08 IST

ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడి

జెనీవా: భారత్‌ రకంగా పిలుస్తున్న ‘బి.1.617’ కరోనా వైరస్‌ను ఇప్పటివరకు 17 దేశాల్లో గుర్తించినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) వెల్లడించింది. ఈ తరహా వైరస్‌ వల్లే ప్రస్తుతం భారత్‌లో కేసుల పెరుగుదల ఎక్కువగా ఉందంటూ ఆందోళన వ్యక్తం చేసింది. ‘బి.1.617’లో... ‘బి.1617.1’, ‘బి.1.617.2’, ‘బి.1.617.3’ వంటి పలు ఉప రకాలు ఉన్నాయి. జన్యు ఉత్పరివర్తనాల ఫలితంగా అవి పుట్టుకొచ్చాయి. బి.1617.1, బి.1617.2లను మన దేశంలో తొలిసారిగా గత ఏడాది డిసెంబరులో గుర్తించారు. ఈ నెల 27 నాటికి ప్రపంచవ్యాప్తంగా 1,200కు పైగా రకాల కరోనా వైరస్‌లను జన్యు విశ్లేషణ ద్వారా గుర్తించినట్లు డబ్ల్యూహెచ్‌వో తెలిపింది. గత వారం రోజుల్లో అంతర్జాతీయంగా 57 లక్షల కొవిడ్‌ కేసులు వెలుగుచూడగా, వాటిలో 38% ఒక్క భారత్‌లోనే వచ్చాయని పేర్కొంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని