తెలుగు రాష్ట్రాల్లో గతేడాది మేలోనే ‘ఎన్‌440కె’ వెలుగులోకి: ఐసీఎంఆర్‌

రోగ నిరోధక శక్తి నుంచి తప్పించుకొనే ఎన్‌440కె రకం వైరస్‌ గతేడాది మేలోనే తెలుగు రాష్ట్రాల్లో కనిపించినట్లు ఐసీఎంఆర్‌ తాజా

Published : 20 May 2021 05:19 IST

ఈనాడు, దిల్లీ: రోగ నిరోధక శక్తి నుంచి తప్పించుకొనే ఎన్‌440కె రకం వైరస్‌ గతేడాది మేలోనే తెలుగు రాష్ట్రాల్లో కనిపించినట్లు ఐసీఎంఆర్‌ తాజా అధ్యయన పత్రంలో వెల్లడించింది. ‘‘ఎన్‌440కె ఉత్పరివర్తనం (స్పైక్‌ ప్రొటిన్‌లో అమినోయాసిడ్‌) తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, అస్సాంలలో గతేడాది మేలో కనిపించింది. ఇన్‌ఫెక్షన్‌ తొలిదశలో డబుల్‌ మ్యుటేషన్‌ లేక ముందుగానే.. ఒకే స్వతంత్ర ఉత్పరివర్తనం (సింగిల్‌ ఇండిపెండెంట్‌ మ్యుటేషన్‌) చోటుచేసుకున్నట్లు దీన్నిబట్టి అర్థమవుతోంది’’ అని ఐసీఎంఆర్‌ అందులో పేర్కొంది. ఈ రకం 2020 మార్చిలో మహారాష్ట్రలో కనిపించిందని వెల్లడించింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు