Published : 20/05/2021 05:27 IST

నూతన గోప్యత విధానాన్ని ఉపసంహరించుకోండి

వాట్సప్‌కు కేంద్రం సూచన

దిల్లీ; నూతనంగా తీసుకొచ్చిన గోప్యత విధానాన్ని వెనక్కి తీసుకోవాలని వాట్సప్‌ సంస్థకు కేంద్ర ఐటీ శాఖ సూచించినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. కొత్త విధానం ద్వారా ‘ఉల్లంఘించడానికి వీల్లేని సమాచార గోప్యత, డేటా భద్రత, వినియోగదారులకు ఉన్న ఎంపిక సౌలభ్యం, భారత పౌరులకు ఉన్న హక్కులు, ప్రయోజనాల’కు భంగం కలుగుతుందని పేర్కొంది. దీనిపై వారం రోజుల్లో సమాధానం ఇవ్వాలని, లేకుంటే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామంటూ మంగళవారం లేఖ రాసింది. ఈ గోప్యత విధానం భారత చట్టాలను ఉల్లంఘించేందిగా ఉందని పేర్కొంది. ఐరోపాలోని వినియోగదారులకు ఒక విధంగా, భారత్‌లోని వారికి మరో విధంగా నిబంధనలు రూపొందించడంపైనా అభ్యంతరం తెలిపింది. వాట్సప్‌ నూతన విధానం ఈ నెల 15 నుంచే అమల్లోకి వచ్చిందని, ఈ నేపథ్యంలో కేంద్రం పంపిన లేఖ ప్రాధాన్యం సంతరించుకొందని జె.సాగర్‌ అసోసియేట్స్‌ అనే సంస్థ భాగస్వామి రాజ్‌ రామచంద్రన్‌ వ్యాఖ్యానించారు. వాట్సప్‌ ఇచ్చే సమాధానంపైనే తదుపరి చర్యలు ఆధారపడి ఉంటాయని చెప్పారు. దీనిపై వాట్సప్‌ అధికార ప్రతినిధిని సంప్రదించగా ప్రభుత్వంతో కలిసి పనిచేస్తామని తెలిపారు. వ్యక్తిగత సమాచారం పరిరక్షణకు తీసుకుంటున్న చర్యలను వివరిస్తామని చెప్పారు. చాలా మంది ఖాతాదార్లు కొత్త విధానానికి మళ్లారని తెలిపారు. అలా మళ్లని వారి ఖాతాలను తామేమీ తొలగించలేదని చెప్పారు. ఇలాంటివారికి రానున్న కొన్ని వారాల పాటు గుర్తు చేస్తునే ఉంటామని అన్నారు.

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జనరల్

మరిన్ని