Gambhir.. మీరు సమాజానికి అపకారం చేస్తున్నారు

భారత మాజీ క్రికెటర్‌, భాజపా పార్లమెంట్‌ సభ్యుడు గౌతమ్‌ గంభీర్‌పై దిల్లీ హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. సమాజానికి గంభీర్‌ అపకారం చేస్తున్నారని న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది.

Updated : 25 May 2021 06:58 IST

దిల్లీ హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు

దిల్లీ: భారత మాజీ క్రికెటర్‌, భాజపా పార్లమెంట్‌ సభ్యుడు గౌతమ్‌ గంభీర్‌పై దిల్లీ హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. సమాజానికి గంభీర్‌ అపకారం చేస్తున్నారని న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. భారీ మొత్తంలో ఔషధాలను కొనుగోలు చేసి, వాటిని నిల్వ చేసి, ఇతరులకు ఉచితంగా పంచడాన్ని న్యాయస్థానం తప్పు పట్టింది. గంభీర్‌ ఉద్దేశం మంచిదే అయినా దాని వల్ల సమాజానికి నష్టం కలుగుతోందని, మార్కెట్‌లో ఔషధాల కొరత ఏర్పడుతోందని పేర్కొంది. సామాన్యులు ఇబ్బందులు పాలవుతున్నారని ఆవేదన వ్యక్తంచేసింది. 2,345 స్ట్రిప్పుల ఫాబీ ఫ్లూ మాత్రలను గంభీర్‌ కొనుగోలు చేయడంపై కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. బయట మార్కెట్‌లో తీవ్ర కొరత ఉన్న ఒక ఔషధాన్ని అంత భారీ సంఖ్యలో గంభీర్‌ ఎలా కొనుగోలు చేశారో విచారణ జరపాలని దిల్లీ ఔషధ నియంత్రణ అధికారిని ఆదేశించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని