DGCA: విమానంలో మదురై జంట వివాహంపై డీజీసీఏ ఆగ్రహం

కొవిడ్‌-19 నిబంధనలను ఉల్లంఘిస్తూ మదురైకి చెందిన ఓ జంట స్పైస్‌జెట్‌ విమానంలో వివాహం చేసుకున్న సంఘటనపై పౌర విమానయాన డైరెక్టరేట్‌ జనరల్‌ (డీజీసీఏ) ఆగ్రహం వ్యక్తంచేసింది.

Updated : 25 May 2021 06:48 IST

స్పైస్‌జెట్‌ సిబ్బందిపై వేటు.. విచారణకు ఆదేశం

దిల్లీ/మదురై: కొవిడ్‌-19 నిబంధనలను ఉల్లంఘిస్తూ మదురైకి చెందిన ఓ జంట స్పైస్‌జెట్‌ విమానంలో వివాహం చేసుకున్న సంఘటనపై పౌర విమానయాన డైరెక్టరేట్‌ జనరల్‌ (డీజీసీఏ) ఆగ్రహం వ్యక్తంచేసింది. విచారణకు ఆదేశించింది. విమాన సిబ్బందిపైనా వేటు వేసింది. ఆదివారం తమిళనాడులోని మదురై విమానాశ్రయం నుంచి 161 మంది పెళ్లి బృందంతో బయల్దేరిన స్పైస్‌జెట్‌ విమానం రెండు గంటలపాటు గాల్లో విహరించింది. ఆ సమయంలో మదురైకు చెందిన రాకేశ్‌, దక్షిణ పెళ్లి చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరలయ్యాయి. అందులో ఎక్కడా కొవిడ్‌-19 నిబంధనలను వధువు, వరుడు, వారి బంధువులు పాటించినట్లు కనిపించలేదు. దీనిపై స్పైస్‌జెట్‌ వివరణ ఇచ్చింది. పెళ్లి కోసం విమానాన్ని బుక్‌ చేసుకుంటున్నట్లు చెప్పలేదని, విహారానికి మాత్రమేనని తెలిపారని పేర్కొంది. కొవిడ్‌ నిబంధనలు పాటిస్తామని పెళ్లి బృందంలోని సభ్యులందరూ హామీ ఇచ్చారని తెలిపింది. విమానంలో ప్రయాణించిన వారందరిపైనా ఫిర్యాదు చేసింది. మదురై కలెక్టర్‌ కూడా ఈ ఘటనపై ప్రాథమిక దర్యాప్తు ప్రారంభించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని