Covid: ‘వజ్ర కవచ్‌’తో ఇన్‌ఫెక్షన్‌కు అడ్డుకట్ట 

ఎన్‌-95 మాస్కులను, పీపీఈ కిట్లను పునర్వినియోగించుకునేలా... ముంబయిలోని ఇంద్రా వాటర్‌ అనే అంకుర

Published : 28 May 2021 14:03 IST


దిల్లీ: ఎన్‌-95 మాస్కులను, పీపీఈ కిట్లను పునర్వినియోగించుకునేలా... ముంబయిలోని ఇంద్రా వాటర్‌ అనే అంకుర సంస్థ సరికొత్త ఇన్‌ఫెక్షన్‌ సంహార వ్యవస్థను రూపొందించింది. ఇప్పటికే వీటిని మహారాష్ట్ర, తెలంగాణల్లోని వివిధ ప్రభుత్వ ఆసుపత్రుల వద్ద ఏర్పాటు చేసినట్టు సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ విభాగం (డీఎస్‌టీ) గురువారం వెల్లడించింది. ‘వజ్ర కవచ్‌’ పేరిట రూపొందించిన ఈ విధానం ద్వారా పీపీఈ కిట్ల తయారీ ఖర్చుతో పాటు... బయో-మెడికల్‌ వ్యర్థాలు కూడా గణనీయంగా తగ్గుతాయని పేర్కొంది. ‘‘వజ్ర కవచ్‌ అనేక దశల్లో వ్యాధి కారకాలను నాశనం చేస్తుంది. ఇందుకు ఆధునిక ఆక్సిడేషన్, కరోనా డిశ్ఛార్జి, యూవీ-సీ కిరణాలను ఉపయోగించాం. వీటి ద్వారా పీపీఈ కిట్లపై ఉండే బ్యాక్టీరియా, ఇతర హానికర క్రిములు 99.9% మేర అచేతనమవుతాయి. ఐఐటీ-బొంబాయి ఈ పరికరం నాణ్యతను ధ్రువీకరించింది’’ అని డీఎస్‌టీ తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని