CRPF: అన్‌ఫిట్‌లు ముందే ఇంటికి

కేంద్ర రిజర్వు పోలీసు దళం (సీఆర్‌పీఎఫ్‌), సరిహద్దు భద్రతా దళం (బీఎస్‌ఎఫ్‌)లలో శారీరకంగా దారుఢ్యంగా లేని (అన్‌ఫిట్‌) సిబ్బందిని

Updated : 09 Jun 2021 07:08 IST

సీఆర్‌పీఎఫ్‌, బీఎస్‌ఎఫ్‌ల్లో నిర్ణయం

ఈనాడు, దిల్లీ: కేంద్ర రిజర్వు పోలీసు దళం (సీఆర్‌పీఎఫ్‌), సరిహద్దు భద్రతా దళం (బీఎస్‌ఎఫ్‌)లలో శారీరకంగా దారుఢ్యంగా లేని (అన్‌ఫిట్‌) సిబ్బందిని కొలువు నుంచి సాగనంపాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. శారీరకంగా దారుఢ్యం లేనివారిని ‘షేప్‌-5’గా పిలుస్తుంటారు. ఈ రెండు భద్రతాదళాల నుంచి షేప్‌-5 జవాన్లను ముందే రిటైర్‌ చేయించి పంపించాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నిర్ణయించినట్లు సమాచారం. ఈ రెండు దళాలు హోం శాఖ పరిధిలోకి వస్తాయి. రెండింటిలోనూ 40-45 ఏళ్ల వయసు మధ్య ఉన్న కొన్ని వందల మంది ఫిట్‌నెస్‌ కోల్పోయారని అధికారులు గుర్తించారు. ‘‘వీరిలో చాలామంది మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో, కశ్మీర్‌లోని ఉగ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో పనిచేస్తున్నారు. ఇలాంటి కీలకమైన చోట్ల శారీరకంగా దృఢంగా లేనివారిని ఉంచటం మంచిది కాదు’’ అని ఓ ఉన్నతాధికారి అభిప్రాయపడ్డారు. గతంలో ఇలా దారుఢ్యంలేనివారిని పోరాట ప్రాంతాల నుంచి తొలగించి, అడ్మినిస్ట్రేషన్‌ పనులు అప్పగించేవారు. కానీ ఈసారి వారికి సర్వీసు నిబంధనల ప్రకారం అన్ని సదుపాయాలతో ముందస్తు రిటైర్మెంట్‌ ఇవ్వాలని భావిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని