Published : 11 Jun 2021 04:36 IST

సర్జికల్‌ మాస్కులు మంచివే!

వాషింగ్టన్‌: కరోనా మహమ్మారి కట్టడిలో మాస్కుల సత్తా మరోసారి రుజువైంది. మాట్లాడేటప్పుడు, దగ్గినప్పుడు ఒక వ్యక్తి నుంచి వెలువడే చిన్నపాటి తుంపర్లను అడ్డుకోవడంలో సర్జికల్‌ మాస్కులు సమర్థంగా పనిచేస్తున్నట్లు అమెరికా శాస్త్రవేత్తలు తేల్చారు. ఈ మాస్కుల అంచుల వద్ద కొద్దిపాటి లీకేజీలు ఉన్నప్పటికీ మొత్తంమీద గాల్లోకి విడుదలయ్యే రేణువులు చాలా తక్కువగా ఉంటున్నట్లు వారు పేర్కొన్నారు. కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం, ఇకాన్‌ స్కూల్‌ ఆఫ్‌ మెడిసిన్‌ శాస్త్రవేత్తలు ఈ పరిశోధన చేశారు. అత్యధిక సమర్థత కలిగిన ఎన్‌95 వంటి మాస్కులను ముఖానికి బిగుతుగా అతుక్కునేలా డిజైన్‌ చేస్తారు. సర్జికల్‌ మాస్కులు, వస్త్రంతో తయారైన ఇతర మాస్కులు ధరించినప్పుడు మాత్రం అంచుల్లో కొంత ఖాళీ ఉంటుంది. ఈ ఖాళీల గుండా రేణువులు బయటకు వస్తున్న తీరును శాస్త్రవేత్తలు పరిశీలించారు. మాట్లాడేటప్పుడు 70 శాతం మేర, దగ్గేటప్పుడు 90 శాతం మేర సమర్థతతో సర్జికల్‌ మాస్కులు పనిచేస్తున్నాయని సిమ్యులేషన్ల ద్వారా శాస్త్రవేత్తలు గుర్తించారు. ఖాళీల గుండా వెలువడే గాలి వల్ల ఈ మాస్కుల సమర్థత తగ్గుతున్నప్పటికీ స్థూలంగా చూస్తే అవి గణనీయ స్థాయిలోనే రేణువులకు అడ్డుకట్ట వేస్తున్నాయని క్రిస్టోఫర్‌ చెప్పారు. మాస్కులు.. ఒక వ్యక్తి నుంచి వెలువడే గాలి దిశను మారుస్తాయని కూడా తెలిపారు. అందువల్ల ఎదురుగా ఉండే వ్యక్తికి రక్షణ లభిస్తుందన్నారు.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని