NIA: ఆ ఇద్దరినీ గుర్తుపడితే రూ.20 లక్షలు

ఈ ఏడాది ప్రారంభంలో స్థానిక ఇజ్రాయెల్‌ దౌత్య కార్యాలయం బయట పేలుడు పదార్థాలు అమర్చుతూ సీసీ టీవీ కెమెరాకు చిక్కిన ఇద్దరు ఆగంతకులను గుర్తుపట్టిన వారికి రూ.10 లక్షల చొప్పున నగదు బహుమతి అందజేస్తామని జాతీయ పరిశోధన సంస్థ (ఎన్‌ఐఏ)

Updated : 16 Jun 2021 07:17 IST

జాతీయ పరిశోధన సంస్థ ప్రకటన

దిల్లీ: ఈ ఏడాది ప్రారంభంలో స్థానిక ఇజ్రాయెల్‌ దౌత్య కార్యాలయం బయట పేలుడు పదార్థాలు అమర్చుతూ సీసీ టీవీ కెమెరాకు చిక్కిన ఇద్దరు ఆగంతకులను గుర్తుపట్టిన వారికి రూ.10 లక్షల చొప్పున నగదు బహుమతి అందజేస్తామని జాతీయ పరిశోధన సంస్థ (ఎన్‌ఐఏ) మంగళవారం ప్రకటించింది. ఆ ఇద్దరినీ గుర్తుపట్టేలా సమాచారం ఇచ్చినా, వారి అరెస్టుకు సహకరించినా రివార్డు ఉంటుంది. గత జనవరి 29న దిల్లీలోని ఇజ్రాయెల్‌ దౌత్య కార్యాలయం బయట మందుపాతర పేలింది. ఈ కేసును ఫిబ్రవరి 2న ఎన్‌ఐఏకు అప్పగించారు. 150 మీటర్ల మేర ప్రభావం చూపిన నాటి పేలుడులో ఎవరూ గాయపడలేదు. కొన్ని కార్లు దెబ్బతిన్నాయి. పేలుడుకు సంబంధించి కొన్ని చిత్రాలు, వీడియో అందుబాటులో పెడుతున్నామని.. సమాచారం తెలిసినవారు 'do.nia@gov.in', 'info.nia@gov.in' చిరునామాలకు మెయిల్‌ చేయవచ్చని, 01124368800 లేదా 9654447345 నంబర్లకు ఫోను ద్వారా తెలుపవచ్చని ఎన్‌ఐఏ ప్రతినిధి తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని