- TRENDING TOPICS
- Ind vs Zim
- Monkeypox
Corona: తీవ్రస్థాయి కొవిడ్ రోగుల పాలిట సంజీవని!
లండన్: తీవ్రస్థాయి కొవిడ్ బాధితుల ప్రాణాలను నిలబెట్టడంలో ఓ ఔషధ సమ్మేళనం మెరుగ్గా పనిచేస్తున్నట్లు పరిశోధకులు తేల్చారు. సొంతంగా యాంటీబాడీలను వృద్ధి చేసుకోలేకపోతున్న రోగుల పాలిట ఇది వరంగా మారే అవకాశముందని వారు పేర్కొన్నారు. అమెరికాకు చెందిన రీజెనరాన్ సంస్థ తయారుచేస్తున్న ‘రీజెన్-కొవ్’ అనే యాంటీ వైరల్ సమ్మేళనాన్ని.. గత ఏడాది సెప్టెంబరు నుంచి ఈ ఏడాది మే వరకు మొత్తం 9,875 మంది కొవిడ్ రోగులకు పరిశోధకులు అందించారు. అది కాసిరివిమాబ్, ఇమ్డెవిమాబ్ అనే రెండు మోనోక్లోనల్ యాంటీబాడీల మిశ్రమం. కణాల్లోకి చొచ్చుకెళ్లేందుకు కరోనా వైరస్ ఉపయోగించుకునే స్పైక్ ప్రొటీన్ సామర్థ్యాన్ని ఈ సమ్మేళనం దెబ్బతీస్తున్నట్లు తాము గుర్తించామని ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం పరిశోధకుడు మార్టిన్ లాండ్రే తెలిపారు. వెంటిలేటర్ అవసరమయ్యే రోగుల సంఖ్య తగ్గుదలకు, ఆస్పత్రిలో చికిత్సా సమయాన్ని తగ్గించేందుకు ఇది దోహదపడుతున్నట్లు వెల్లడించారు. ప్రతి వంద మంది రోగుల్లో 6% మరణాలను ఈ సమ్మేళనం తగ్గించగలదని పేర్కొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Tollywood: విజయేంద్రప్రసాద్ కథతో భారీ బడ్జెట్ మూవీ.. దర్శకుడు ఎవరంటే?
-
Politics News
Telangana News: కాంగ్రెస్‌లో మరో అసమ్మతి స్వరం.. పీసీసీ తీరుపై మర్రి శశిధర్‌రెడ్డి అసహనం
-
Sports News
ZIM vs IND : జింబాబ్వేతో జర జాగ్రత్త రాహుల్ భాయ్.. ఆదమరిస్తే ఓటమే!
-
Movies News
Nassar: సినీ నటుడు నాజర్‌కు గాయాలు.. ఆసుపత్రికి తరలింపు
-
Crime News
Chocolate: గోదాంలోకి చొరబడి చాక్లెట్లను ఎత్తుకెళ్లిన దొంగలు.. ధర రూ.17లక్షలు!
-
General News
Telangana News: వాసవి గ్రూప్ స్థిరాస్తి సంస్థపై ఐటీ దాడులు.. 40 బృందాలతో సోదాలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- స్తంభనలోపాన్ని కట్టేయండి
- Hrithik Roshan: హృతిక్! ముందు నీ సినిమా సంగతి చూసుకో..
- Hyderabad News: అనుమానాస్పద స్థితిలో సాఫ్ట్వేర్ ఇంజినీరు మృతి
- Pak PM: ఆసియా టైగర్ అవుతామనుకున్నాం.. కానీ, ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయాం
- Noida Twin Towers: అమాంతం నీరు కిందికి దుమికినట్లు.. భవనాలు కుప్పకూలుతాయి..!
- TSRTC: హైదరాబాద్‌లో ఇకపై ఆ రెండు గంటలూ ఉచిత ప్రయాణం..
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (17/08/2022)
- S Jaishankar: కుమారుడితో రెస్టారెంట్‌కు కేంద్రమంత్రి.. తర్వాత ఏం జరిగిందంటే..?
- Naga Chaitanya: ఆ నటి అంటే నాకెంతో ఇష్టం: నాగచైతన్య
- Meira Kumar: 100ఏళ్ల క్రితం మా నాన్న జగ్జీవన్రామ్నూ ఇలాగే కొట్టారు..