Corona: కొవిడ్‌తో మెదడులో ‘మ్యాటర్‌’ తగ్గుతోంది

కొవిడ్‌-19 నుంచి కోలుకున్నవారిలో మెదడులో గ్రే మ్యాటర్‌ తగ్గిపోతున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. వారి స్కాన్లను పరిశీలించినప్పుడు ఈ విషయం వెల్లడైంది.

Updated : 20 Jun 2021 07:52 IST

లండన్‌: కొవిడ్‌-19 నుంచి కోలుకున్నవారిలో మెదడులో గ్రే మ్యాటర్‌ తగ్గిపోతున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. వారి స్కాన్లను పరిశీలించినప్పుడు ఈ విషయం వెల్లడైంది. బ్రిటన్‌లోని ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ఈ పరిశోధన చేశారు. కొవిడ్‌ కేవలం శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్‌ కాదని, కొందరిలో ఇది మెదడుపైనా ప్రభావం చూపుతుందని ఇప్పటికే జరిగిన పరిశోధనల్లో వెల్లడైంది. పక్షవాతం, డిమెన్షియా వంటి సమస్యలకు ఇది దారితీయవచ్చని అధ్యయనాలు తేల్చాయి. తాజాగా గ్రే మ్యాటర్‌ కూడా తగ్గిపోతోందని వెల్లడైంది. మెదడులో సమాచారాన్ని ప్రాసెస్‌ చేయడంలో ఈ పదార్థం కీలక పాత్ర పోషిస్తుంది. తద్వారా వ్యక్తులు తమ కదలికలు, జ్ఞాపకశక్తి, భావోద్వేగాలను నియంత్రించుకోగలుగుతారు. గ్రే మ్యాటర్‌లో లోపాల వల్ల నాడీ కణాలు, కమ్యూనికేషన్‌ వ్యవస్థల పనితీరుపై ప్రభావం పడుతుంది. బ్రిటన్‌లోని ‘బయో బ్యాంక్‌’ నుంచి సేకరించిన సమాచారాన్ని విశ్లేషించిన శాస్త్రవేత్తలు.. కొవిడ్‌ బాధితుల్లో గ్రే మ్యాటర్‌ తగ్గుతున్నట్లు గుర్తించారు. కొవిడ్‌కు ముందు, ఆ తర్వాత వారి మెదడుకు తీసిన స్కాన్లను పోల్చడం ద్వారా దీన్ని నిర్ధారించారు. మెదడులో వాసన, రుచి, జ్ఞాపకశక్తికి సంబంధించిన ప్రాంతాల్లో గ్రే మ్యాటర్‌ తగ్గుతున్నట్లు తేల్చారు. ఈ మార్పులన్నీ మెదడులోకి కొవిడ్‌ వ్యాధి లేదా వైరస్‌ వ్యాప్తిని సూచిస్తున్నాయా అన్నది తేల్చేందుకు పరిశోధనలు చేయాల్సిన అవసరముందని శాస్త్రవేత్తలు తెలిపారు.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 



 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని