Deltavirus: భౌగోళిక ముప్పుగా డెల్టా వేరియంట్‌!

వేగంగా వ్యాపించే స్వభావమున్న డెల్టా వేరియంట్‌ కరోనా వైరస్‌ ఇప్పటివరకు 85 దేశాలకు ప్రబలిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) తెలిపింది. 11 దేశాల్లో గత రెండు వారాల్లోనే డెల్టాను గుర్తించినట్టు పేర్కొంది. ఇదే పోకడ కొనసాగితే ఈ వేరియంట్‌ మొత్తం ప్రపంచానికి ముప్పుగా పరిణమిస్తుందని

Updated : 25 Jun 2021 07:05 IST

ఐరాస: వేగంగా వ్యాపించే స్వభావమున్న డెల్టా వేరియంట్‌ కరోనా వైరస్‌ ఇప్పటివరకు 85 దేశాలకు ప్రబలిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) తెలిపింది. 11 దేశాల్లో గత రెండు వారాల్లోనే డెల్టాను గుర్తించినట్టు పేర్కొంది. ఇదే పోకడ కొనసాగితే ఈ వేరియంట్‌ మొత్తం ప్రపంచానికి ముప్పుగా పరిణమిస్తుందని ఈ నెల 22న విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. డెల్టా కంటే ముందు వేగంగా ప్రబలిన ఆల్ఫా, బీటా, గామా వేరియంట్లను కూడా ‘ఆందోళనకర వేరియంట్లు’గా డబ్ల్యూహెచ్‌వో పేర్కొంది. ప్రస్తుతం అల్ఫా 170 దేశాల్లో, బీటా 119 దేశాల్లో, గామా 71 దేశాల్లో వ్యాపించి ఉన్నాయి. ఆల్ఫా కంటే డెల్టా 1.23 రెట్లు వేగంగా ప్రబలుతున్నట్టు జపాన్‌లో చేసిన అధ్యయనంలో తేలింది. డెల్టా బాధితుల్లో ఆక్సిజన్‌ అవసరం, ఐసీయూలో చేరిక, మరణాలు ఎక్కువగా ఉన్నట్టు సింగపూర్‌లో జరిపిన మరో అధ్యయనం పేర్కొంది. భారత్‌లో రెండో దశ కరోనా వ్యాప్తిలో అత్యధిక మరణాలకు డెల్టానే కారణమని ఇప్పటికే నిపుణులు వెల్లడించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని