
అఫ్గాన్‌కు అండగా ఉంటాం
బైడెన్ హామీ
వాషింగ్టన్: అఫ్గానిస్థాన్ నుంచి సైన్యాన్ని ఉపసంహరించిన తరువాత కూడా ఆ దేశానికి అండగా ఉంటామని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ హామీ ఇచ్చారు. అఫ్గాన్ అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీ, సీయీవో అబ్దుల్లా అబ్దుల్లాలు శుక్రవారం శ్వేత సౌధంలో బైడెన్‌తో భేటీ అయి వివిధ అంశాలపై చర్చించారు. అనంతరం వారితో కలిసి ఉమ్మడిగా విలేకరుల సమావేశం నిర్వహించారు. రెండు దేశాల భాగస్వామ్యం ముగిసేది కాదని, సుస్థిరంగా కొనసాగుతుందని ఈ సందర్భంగా బైడెన్ విస్పష్టంగా ప్రకటించారు. సెప్టెంబరు 11 తరువాత అమెరికా బలగాలు వెనక్కి వచ్చినప్పటికీ, అఫ్గాన్‌కు కావలసినవన్నీ సమకూర్చుతామని చెప్పారు. ‘‘తమకు ఏమి కావాలో అఫ్గాన్లు నిర్ణయించుకోవాలి. మేం సాయం చేయడం లేదు కాబట్టి వారి నిర్ణయాలేవో వారు తీసుకోవాలన్నది దీని సారాంశం కాదు. అర్థంలేని హింస ఆగిపోవాలి. అయితే ఇది చాలా కష్టమే..’’అని వ్యాఖ్యానించారు. తమ రక్షణ కోసం అమెరికా రక్తంతోపాటు ధనాన్ని ధారబోసిందంటూ ఘనీ కృతజ్ఞతలు తెలిపారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.