GST పరిధిలోకి ఇంధనం.. అభ్యంతరం లేదు!

ఇంధనాన్ని వస్తుసేవల పన్ను (జీఎస్‌టీ) పరిధిలోనికి తెస్తే కేంద్రానికి ఎలాంటి అభ్యంతరం లేదని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ స్పష్టం చేశారు. బెంగళూరులో శుక్రవారం విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ...

Updated : 03 Jul 2021 06:59 IST

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌

ఈనాడు డిజిటల్‌, బెంగళూరు: ఇంధనాన్ని వస్తుసేవల పన్ను (జీఎస్‌టీ) పరిధిలోనికి తెస్తే కేంద్రానికి ఎలాంటి అభ్యంతరం లేదని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ స్పష్టం చేశారు. బెంగళూరులో శుక్రవారం విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ... జీఎస్‌టీ పరిధిలోనికి డీజిల్‌, పెట్రోలును తెచ్చే నిర్ణయం జీఎస్‌టీ మండలి తీసుకుంటుందని గుర్తుచేశారు. ఇందుకు ప్రత్యేకంగా చట్టాన్ని సవరించాల్సిన అవసరమూ లేదన్నారు. రాష్ట్రాలకు చెల్లించే జీఎస్‌టీ పరిహారాన్ని కేంద్రం అడ్డుకుంటోందనే విపక్షాల ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. ఇంధన ధరలు పెరిగినా.. ఎక్సైజ్‌ సుంకాన్ని తగ్గించే ప్రతిపాదన లేదన్నారు.

లాక్‌డౌన్‌ సందర్భంగా ఆర్థిక ప్యాకేజీలు ప్రకటించిన కేంద్రం ఈ లోటును పెంచిన ధరల నుంచి భర్తీ చేస్తుందన్న ఆరోపణలను మంత్రి తోసిపుచ్చారు. విదేశీ మార్కెట్‌లో ముడిచమురు బ్యారెల్‌ 75 డాలర్లకు చేరిందన్నారు. పప్పుధాన్యాలు, నూనెగింజల ఉత్పత్తి తగ్గిపోవటంతో మయన్మార్‌, ఆఫ్రికా, కెనడాల దిగుమతి చేసుకోవటంతో నిత్యావసర ధరలు పెరిగాయన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని