Updated : 04 Jul 2021 13:27 IST

నింగిలోకి ఒకేసారి 88 ఉపగ్రహాలు

స్పేస్‌ఎక్స్‌ ప్రయోగం

వాషింగ్టన్‌: ఒకే రాకెట్‌ ద్వారా పెద్ద సంఖ్యలో ఉపగ్రహాలను ప్రయోగించే కసరత్తును అమెరికాకు చెందిన అంతరిక్ష సంస్థ ‘స్పేస్‌ఎక్స్‌’ కొనసాగిస్తోంది. తాజాగా ‘ట్రాన్స్‌పోర్టర్‌-2’ మిషన్‌లో భాగంగా ఒకేసారి 88 ఉపగ్రహాలను రోదసిలోకి పంపింది. పాల్కన్‌-9 రాకెట్‌ ద్వారా ఫ్లోరిడాలోని కేప్‌ కెనావెరాల్‌ అంతరిక్ష కేంద్రం నుంచి ఈ ప్రయోగం జరిపింది. 2021లో ఈ సంస్థకు ఇది 20వ ప్రయోగం కావడం గమనార్హం. వీటి ద్వారా 900 ఉపగ్రహాలను రోదసిలోకి పంపింది. ప్రస్తుత ప్రయోగంలో భూకక్ష్యలోకి వెళ్లిన ఉపగ్రహాల్లో వాణిజ్య సంస్థలకు చెందినవి 85 ఉండగా, ప్రభుత్వ, ‘స్టార్‌లింక్‌’ ప్రాజెక్టు ఉపగ్రహాలు మూడేసి చొప్పున ఉన్నాయి. ఇందులో క్యూబ్‌శాట్స్‌, మైక్రోశాట్స్‌, ఆర్బిటర్‌ ట్రాన్స్‌ఫర్‌ వెహికిల్స్‌ వంటివి ఉన్నాయి. జనవరిలో ‘ట్రాన్స్‌పోర్టర్‌-1’ మిషన్‌ ద్వారా 143 ఉపగ్రహాలను స్పేస్‌ఎక్స్‌ ప్రయోగించింది. ప్రస్తుతం ట్రాన్స్‌పోర్టర్‌-2 కింద ప్రయోగించిన శాటిలైట్ల సంఖ్య తక్కువగా ఉన్నప్పటికీ వాటి ఉమ్మడి బరువు మునుపటి ప్రయోగంలోని ఉపగ్రహాలతో పోలిస్తే అధికంగా ఉంటుంది.


Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts