Mango: ప్రపంచంలోనే అతిపెద్ద మామిడి!

మధ్యప్రదేశ్‌ ధార్‌ ప్రాంతంలోని రాజ్‌పురాకి చెందిన రామేశ్వర్‌, జగదీశ్‌ అనే అన్నదమ్ములు ప్రపంచంలో పేరుగాంచిన మామిడి రకాలను సాగు చేస్తున్నారు. వీరి తోటలో సుమారు 50కు పైగా మామిడి రకాలు ఉన్నాయి.

Updated : 05 Jul 2021 06:43 IST

మధ్యప్రదేశ్‌లో పండిస్తున్న రైతు సోదరులు

మధ్యప్రదేశ్‌ ధార్‌ ప్రాంతంలోని రాజ్‌పురాకి చెందిన రామేశ్వర్‌, జగదీశ్‌ అనే అన్నదమ్ములు ప్రపంచంలో పేరుగాంచిన మామిడి రకాలను సాగు చేస్తున్నారు. వీరి తోటలో సుమారు 50కు పైగా మామిడి రకాలు ఉన్నాయి. ప్రపంచంలోని మామిడి కాయల్లో ఎక్కువ బరువు ఉండే ఆమ్రాపురి రకాన్ని కూడా వీరు పండిస్తున్నారు. మెక్సికోకు చెందిన సెన్సేషన్‌ అనే మరో రకాన్ని కూడా పండిస్తున్నారు. ఆమ్రాపురి.. అఫ్గానిస్థాన్‌ రకం మామిడి. ఒక్కొక్కటి సుమారు 4.5 కిలోల వరకు బరువుంటుందని ఈ అన్నదమ్ములు చెప్పారు. సెన్సేషన్‌ రకం కిలో రూ.వెయ్యి వరకు పలుకుతుందని పేర్కొన్నారు. తోటలో ఉండే మామిడి రకాలను సేకరించడానికి భారత్‌లోని పలు ప్రాంతాలతో సహా విదేశాలకూ వెళ్లినట్లు చెప్పారు. బెంగాల్‌కు చెందిన మాల్డా, హిమసాగర్‌, గుజరాత్‌లోని కేసర్‌, ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన లంగ్రా, బిహార్‌, హిమాచల్‌ ప్రదేశ్‌కు చెందిన చౌన్సా మామిడి పండ్లు మా దగ్గర పండుతున్నాయని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని