మోదీకి మామిడి పండ్లు పంపిన బంగ్లా ప్రధాని

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా వివిధ రాజకీయ నేతలకు బంగ్లాదేశ్‌ ప్రధాని షేక్‌ హసీనా 2600 కేజీల మామిడి పండ్లను బహుమతిగా పంపారు. బంగ్లా నుంచి ఒక ట్రక్కులో బయల్దేరిన ఈ ‘హరిబంగ’ రకం మామిడి పళ్లు..

Updated : 06 Jul 2021 11:53 IST

ఢాకా: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా వివిధ రాజకీయ నేతలకు బంగ్లాదేశ్‌ ప్రధాని షేక్‌ హసీనా 2600 కేజీల మామిడి పండ్లను బహుమతిగా పంపారు. బంగ్లా నుంచి ఒక ట్రక్కులో బయల్దేరిన ఈ ‘హరిబంగ’ రకం మామిడి పళ్లు.. కోల్‌కతాలోని బంగ్లా అధికారులకు చేరాయి. వీటిని మోదీతో పాటు.. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఇతర రాజకీయ నేతలకు పంచనున్నారు. భారత్‌తో స్నేహ సంబంధాలకు గుర్తుగా ఈ మామిడి పండ్లను హసీనా పంపినట్లు బంగ్లా అధికార వర్గాలు తెలిపాయి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని