Universe: విశ్వంలో రాకాసి సునామీలు

సముద్రాల్లో భూకంపాలు, అగ్నిపర్వత విస్ఫోటాలు చెలరేగినప్పుడు సునామీ రూపంలో భారీ అలలు తీర ప్రాంతాలను ముంచెత్తుతుంటాయి. విశ్వంలోనూ ఇలాంటి రాకాసి

Updated : 07 Jul 2021 12:50 IST

వాషింగ్టన్‌: సముద్రాల్లో భూకంపాలు, అగ్నిపర్వత విస్ఫోటాలు చెలరేగినప్పుడు సునామీ రూపంలో భారీ అలలు తీర ప్రాంతాలను ముంచెత్తుతుంటాయి. విశ్వంలోనూ ఇలాంటి రాకాసి అలలు ఏర్పడవచ్చని శాస్త్రవేత్తలు తాజాగా తేల్చారు. వాయువులు, రేడియోధార్మికతతో కూడిన ఈ తరంగాలు కృష్ణబిలాల నుంచి వెలువడతాయని పేర్కొన్నారు. విశ్వంలోని నిగూఢ ఆకృతుల్లో ఒకటైన కృష్ణబిలాలు ఎప్పుడూ శాస్త్రవేత్తలకు సవాళ్లు రువ్వుతూనే ఉన్నాయి. వాటికి బలమైన గురుత్వాకర్షణ శక్తి ఉంటుంది. దాని ప్రభావం నుంచి కాంతి కూడా తప్పించుకోలేదు. సూర్యుడి కన్నా 10 లక్షల రెట్లు ఎక్కువ ద్రవ్యరాశి కలిగిన ఒక కృష్ణబిలం.. గెలాక్సీ మధ్యలోని వాయు, ధూళి మేఘం నుంచి పదార్థాన్ని తనవైపునకు ఆకర్షిస్తుంటే దాన్ని ‘యాక్టివ్‌ గెలాక్టిక్‌ న్యూక్లియస్‌’గా పేర్కొంటారని నాసా తెలిపింది. అలాంటి ప్రదేశాల నుంచి భారీగా విద్యుదయస్కాంత తరంగాలు వెలువడుతుంటాయని పేర్కొంది. ఈ భారీ కృష్ణబిలం అంచుల్లోని శీతల వాతావరణంలో సుడులు తిరిగే ధూళి మేఘాలు.. సముద్రాల మాదిరిగా అలలను ఏర్పర్చగలవని సిమ్యులేషన్ల ఆధారంగా తేలినట్లు వెల్లడించింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని