Updated : 14/07/2021 10:26 IST

నేపాల్‌ ప్రధానిగా ఐదోసారి దేవ్‌బా బాధ్యతల స్వీకరణ

కాఠ్‌మాండూ: నేపాల్‌ ప్రధానమంత్రిగా నేపాలీ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు షేర్‌ బహదూర్‌ దేవ్‌బా (75) మంగళవారం ప్రమాణం చేశారు. ఆయన ప్రధాని పీఠమెక్కడం ఇది ఐదోసారి. నేపాల్‌లో పార్లమెంటులో ప్రతినిధుల సభను పునరుద్ధరించిన సుప్రీం కోర్టు.. ప్రధానిగా దేవ్‌బాను నియమించాలంటూ సోమవారం చరిత్రాత్మక తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. న్యాయస్థానం ఆదేశాలకు అనుగుణంగా దేశాధ్యక్షురాలు బిద్యాదేవి భండారి.. దేవ్‌బాను ప్రధానిగా నియమించారు. ఆయన 30 రోజుల్లోగా విశ్వాస పరీక్ష నెగ్గాల్సి ఉంటుంది.  దేవ్‌బాను ప్రధానిగా నియమిస్తూ దేశాధ్యక్షురాలు ఇచ్చిన ఉత్తర్వులు స్పష్టంగా లేకపోవడంతో తొలుత కొంతసేపు గందరగోళం నెలకొంది. రాజ్యాంగంలోని 76(5) ఆర్టికల్‌ ప్రకారం దేవ్‌బాకు ప్రధాని పగ్గాలను అప్పగించాలని సుప్రీం కోర్టు సోమవారం సూచించింది. ఆ ఆర్టికల్‌ను అధ్యక్షురాలు ప్రస్తావించకపోవడాన్ని నేపాలీ కాంగ్రెస్‌ పార్టీ ఆక్షేపించింది. ఆ వివరాలతో కొత్త ఉత్తర్వులు వెలువడ్డాకే దేవ్‌బా ప్రమాణం చేశారు. దీంతో ప్రమాణ స్వీకార కార్యక్రమం కొంత ఆలస్యమైంది. దేవ్‌బాతో పాటు నలుగురు మంత్రులు ప్రమాణం చేశారు.

పార్లమెంటరీ ఎన్నికలు వాయిదా

నేపాల్‌లో ఈ ఏడాది నవంబరు 12, 19 తేదీల్లో జరగాల్సిన పార్లమెంటరీ ఎన్నికలను వాయిదా వేస్తున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. ఇటీవల రద్దయిన ప్రతినిధుల సభను సుప్రీం కోర్టు పునరుద్ధరించిన నేపథ్యంలో వాయిదా నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. కాగా సుప్రీంకోర్టు ఉద్దేశపూర్వకంగానే విపక్షాలకు అనుకూలంగా సోమవారం నాటి తీర్పును వెలువరించిందని నేపాల్‌ మాజీ ప్రధాని కె.పి.శర్మ ఓలి ఆరోపించారు. బహుళ పార్టీ పార్లమెంటరీ వ్యవస్థ ఉన్న తమ దేశంలో ఈ తీర్పు ప్రభావం దీర్ఘకాలం పాటు ఉంటుందని పేర్కొన్నారు.


Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జనరల్

మరిన్ని