Sharad Pawar: రాష్ట్రపతి రేసులో లేను: శరద్‌ పవార్‌

వచ్చే ఏడాది రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్ష పార్టీల అభ్యర్థిగా తాను బరిలో దిగనున్నట్లు వస్తున్న వార్తలను ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌ (80) ఖండించారు.

Updated : 15 Jul 2021 07:17 IST

ముంబయి: వచ్చే ఏడాది రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్ష పార్టీల అభ్యర్థిగా తాను బరిలో దిగనున్నట్లు వస్తున్న వార్తలను ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌ (80) ఖండించారు. తాను ఆ పదవి రేసులో లేనని స్పష్టం చేశారు. పార్లమెంటులో ఎన్డీయేకు విస్పష్ట మెజారిటీ ఉన్న నేపథ్యంలో.. ఆ కూటమికి పోటీగా బరిలో దిగే అభ్యర్థికి ఎలాంటి ఫలితం వస్తుందన్నది ముందే ఊహించుకోవచ్చని పవార్‌ అన్నట్లు ఎన్సీపీ వర్గాలు తెలిపాయి. శరద్‌ పవార్‌తో ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ ఇటీవల రెండుసార్లు భేటీ అయ్యారు. కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఆ పార్టీ అగ్ర నేతలు రాహుల్‌ గాంధీ, ప్రియాంకలతోనూ ఆయన సమావేశమయ్యారు. దీంతో పవార్‌ను రాష్ట్రపతి ఎన్నికల బరిలో నిలిపే ప్రయత్నాలు జరుగుతున్నట్లు ఊహాగానాలు వెలువడ్డాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని