Indian Navy: రోమియోలు వచ్చేశాయి!
భారత నౌకాదళ పోరాట సామర్థ్యం మరింత పటిష్ఠమైంది. అమెరికా నుంచి అధునాతన ఎంహెచ్-60 రోమియో (ఆర్) బహుళ ప్రయోజన హెలికాప్టర్లు మన అమ్ములపొదిలో చేరాయి. అమెరికాలోని శాన్డియెగోలో జరిగిన ఒక కార్యక్రమంలో లాంఛనంగా రెండు హెలికాప్టర్లను భారత రాయబారి తరణ్‌జిత్ సింగ్ సంధుకు అమెరికా నౌకాదళ అధికారులు అందజేశారు.
భారత నౌకాదళంలోకి ఎంహెచ్-60ఆర్ హెలికాప్టర్లు
దిల్లీ: భారత నౌకాదళ పోరాట సామర్థ్యం మరింత పటిష్ఠమైంది. అమెరికా నుంచి అధునాతన ఎంహెచ్-60 రోమియో (ఆర్) బహుళ ప్రయోజన హెలికాప్టర్లు మన అమ్ములపొదిలో చేరాయి. అమెరికాలోని శాన్డియెగోలో జరిగిన ఒక కార్యక్రమంలో లాంఛనంగా రెండు హెలికాప్టర్లను భారత రాయబారి తరణ్‌జిత్ సింగ్ సంధుకు అమెరికా నౌకాదళ అధికారులు అందజేశారు.
ప్రపంచంలోనే శక్తిమంతం
‘ఎంహెచ్-60ఆర్’లు నాలుగోతరం నేవీ హెలికాప్టర్లు. ఈ శ్రేణిలో ఇవి ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైనవిగా గుర్తింపు పొందాయి. భారత నౌకాదళంలో కాలం చెల్లిన ‘సీ కింగ్’ హెలికాప్టర్ల స్థానంలో ఇవి సేవలు అందించనున్నాయి.
ఆయుధాలు: హెల్ఫైర్ క్షిపణులు, ఏటీకే మార్క్ 50, 46 టోర్పిడోలు, 7.62 ఎంఎం మెషీన్ గన్.
అడుగడుగునా అధునాతనం: సరికొత్త ఏవియానిక్స్, సెన్సర్లు ఈ హెలికాప్టర్ సొంతం. పైలట్లు సులువుగా నిర్వహించేలా కాక్‌పిట్‌ను ఆధునిక సాధనాలతో తీర్చిదిద్దారు. ఇందులో కలర్ మల్టీ ఫంక్షన్ డిస్ప్లేలను పెట్టారు. నైట్ విజన్ గాగుల్స్ ద్వారా రాత్రివేళ కూడా ఈ స్క్రీన్లను వీక్షించొచ్చు. సూర్యకాంతిలోనూ స్పష్టంగా కనిపించేలా ప్రత్యేకంగా రూపొందించారు. శత్రు క్షిపణి దాడిపై హెచ్చరిక చేసే వ్యవస్థ, మల్టీ మోడ్ రాడార్, సోనార్, ఇన్ఫ్రారెడ్ జామర్ వంటి అనేక సెన్సర్లు ఇందులో ఉన్నాయి. ఎలాంటి వాతావరణంలోనైనా ఈ హెలికాప్టర్ పోరాడగలదు.
జలాంతర్గాములకు చుక్కలే: ఎంహెచ్-60హెలికాప్టర్..శత్రు జలాంతర్గాములకు చుక్కలు చూపించనుంది. మన నౌకాదళంలోని సముద్రగస్తీ విమానం పి-8ఐ, సీ గార్డియన్ డ్రోన్లతో కలిసి ఇది భారత జలాలను శత్రు దుర్భేద్యంగా మార్చనుంది.
శత్రు యుద్ధనౌకలపై పోరు, ప్రత్యేక బలగాల తరలింపు, యుద్ధనౌకల్లోకి సరకుల రవాణా, గాలింపు, సహాయ చర్యలు, పోరాటంలో గాయపడినవారిని తరలించడానికీ ఈ హెలికాప్టర్లు ఉపయోగపడతాయి.
హిందూ మహాసముద్ర ప్రాంతంలో చైనా జలాంతర్గాముల కదలికల నేపథ్యంలో ఈ హెలికాప్టర్లు మనకు అవసరమయ్యాయి.
* భారత్ కొనుగోలు చేస్తున్న హెలికాప్టర్లు: 24
* కాంట్రాక్టు ధర: 260 కోట్ల డాలర్లు
* తయారీదారు: సికోర్స్కీ-లాక్‌హీడ్ మార్టిన్ (అమెరికా)
* ఇంజిన్లు: రెండు (టర్బోషాఫ్ట్)
* గరిష్ఠ వేగం: గంటకు 267 కిలోమీటర్లు
* బరువు: 6,895 కిలోలు
* గరిష్ఠ టేకాఫ్ బరువు: 10,659 కిలోలు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!
-
ఓటరు జాబితాలో.. ‘డీ’ ఓటరు అంటే ఎవరు?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
ఏపీ ఇంటెలిజెన్స్ డీజీగా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామక్రిష్ణ
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..