ముంబయిలో వర్ష బీభత్సం

దేశ ఆర్థిక రాజధాని ముంబయిని భారీ వర్షాలు అతలాకుతలం చేశాయి. శనివారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వివిధ ప్రాంతాల్లో కొండ చరియలు విరిగిపడి, ఇళ్లు కూలి 30 మంది మృతి చెందారు. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.

Published : 19 Jul 2021 05:14 IST

 30 మంది మృతి

ముంబయి: దేశ ఆర్థిక రాజధాని ముంబయిని భారీ వర్షాలు అతలాకుతలం చేశాయి. శనివారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వివిధ ప్రాంతాల్లో కొండ చరియలు విరిగిపడి, ఇళ్లు కూలి 30 మంది మృతి చెందారు. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. సబర్బన్‌ రైలు సేవలకు అంతరాయం కలిగింది. దూర ప్రాంత రైళ్లను వివిధ స్టేషన్లలో నిలిపివేశారు. కొన్నింటిని మళ్లించారు. చెంబూర్‌లోని కొండ ప్రాంతంలో ఇళ్లపై ప్రహరీ గోడ కూలి 19 మంది, విఖ్రోలీ శివారుల్లో కొండచరియలు విరిగి పడి పది మంది మరణించారు. భాండూప్‌లో అటవీ విభాగానికి చెందిన ప్రహరీ గోడ మీద పడి 16 ఏళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. బోరివలీలో వరదల ధాటికి వాహనాలు కొట్టుకుపోయాయి. కుండపోత వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు చోట్ల విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. సోమవారం కూడా ముంబయితో పాటు పరిసర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ విభాగం అంచనా వేసింది. ఇదివరకు జారీ చేసిన గ్రీన్‌ అలర్ట్‌ను రెడ్‌ అలర్ట్‌గా మార్చింది. ముంబయిలో కేవలం 6 గంటల వ్యవధిలోనే 100 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు పేర్కొంది. చెంబూర్‌, విఖ్రోలిలో జరిగిన ప్రమాదాలపై రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. రూ.2లక్షల చొప్పున పరిహారంగా అందిస్తున్నట్లు ప్రధానమంత్రి కార్యాలయం ప్రకటించింది. క్షతగాత్రులకు రూ.50 వేల సాయం అందిస్తామని తెలిపింది.  మహారాష్ట్ర సర్కారు మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున నష్టపరిహారం ప్రకటించింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు