Supreme Court: విడిపోయిన దంపతులను ఒక్కటి చేసిన సుప్రీం

విడిగా ఉంటున్న దంపతులను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ నేతృత్వంలోని ధర్మాసనం ఒక్కటి చేసింది! పుణెకు చెందిన భర్త, రాంచీకి చెందిన భార్యతో వీడియో ద్వారా సంభాషించింది. సదరు వ్యక్తి భార్యను వేధింపులకు గురిచేస్తుండటంతో ఆమె

Updated : 05 Aug 2021 08:14 IST

దిల్లీ: విడిగా ఉంటున్న దంపతులను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ నేతృత్వంలోని ధర్మాసనం ఒక్కటి చేసింది! పుణెకు చెందిన భర్త, రాంచీకి చెందిన భార్యతో వీడియో ద్వారా సంభాషించింది. సదరు వ్యక్తి భార్యను వేధింపులకు గురిచేస్తుండటంతో ఆమె కేసు పెట్టింది. దీంతో బెయిల్‌ కోరుతూ ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మరోవైపు- భార్యపై విడాకులు సహా పలు కేసులు వేశారు. ఈ వ్యవహారం బుధవారం జస్టిస్‌ ఎన్‌.వి.రమణ, జస్టిస్‌ సూర్యకాంత్‌ల ధర్మాసనం ముందుకు వచ్చింది. జస్టిస్‌ సూర్యకాంత్‌ కక్షిదారులు ఇద్దరితో హిందీలో మాట్లాడారు. భర్త దగ్గరకు వెళ్లడం తనకు ఇష్టమేనని భార్య చెప్పింది. దీంతో ‘‘మీ భార్యపై పెట్టిన కేసులను ఉపసంహరించుకోండి. 2 వారాల్లో అఫిడవిట్‌ సమర్పించండి. అదే సమయంలో భార్యను మీతోపాటు తీసుకెళ్లండి. కొన్ని రోజులు మీ ప్రవర్తనను గమనిస్తాం. కోర్టుకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి. లేదంటే మళ్లీ మీరు జైలుకు వెళ్లాల్సి ఉంటుంది’’ అని పేర్కొన్నారు.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని