
తప్పు తెలుసుకుని ఇంటికి వచ్చినా.. కన్నవారే పొట్టన బెట్టుకున్నారు
మధ్యప్రదేశ్లో పరువు హత్య
గ్వాలియర్: ప్రేమ మోజులో వేరే వర్గం వ్యక్తితో వెళ్లిన యువతి.. తర్వాత తప్పు తెలుసుకొని తిరిగి ఇంటికొచ్చింది. ఆదరించాల్సిన కన్నవారే ఆమెను పరువు పేరిట పొట్టనబెట్టుకున్నారు. పైగా ఆత్మహత్యగా చిత్రీకరించారు. మధ్యప్రదేశ్లో ఈనెల 2న జరిగిన ఈ ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గ్వాలియర్ నగరానికి చెందిన 20 ఏళ్ల యువతి జూన్ 5న వేరే వర్గం వ్యక్తితో కలిసి పారిపోయింది. రెండు రోజులకు తిరిగొచ్చిన ఆమెను పోలీసులు మహిళా సంరక్షణ గృహానికి తరలించారు. ఆ తర్వాత కన్నవాళ్లతోనే ఉంటాననడంతో జులై 31న ఇంటికి పంపారు. ఆగస్టు 2న ఆమెను కన్న తండ్రి, తోడబుట్టిన సోదరుడు, బంధువులే కడతేర్చారు. తన కుమార్తె ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుందంటూ అదే రోజు తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులకు తాజాగా ఫోరెన్సిక్ నివేదికతో హత్య అని తేటతెల్లమైంది. తండ్రి, సోదరుడిని అరెస్టు చేసి విచారించగా నేరాన్ని అంగీకరించారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నారు.
ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు/ సేవల గురించి ఈనాడు సంస్థకి ఎటువంటి అవగాహనా ఉండదు. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి, జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు/ సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు.