Published : 14/08/2021 04:58 IST

దక్షిణ అఫ్గాన్‌పై తాలిబన్ల పట్టు

తిరుగుబాటుదారుల వశమైన మరో 4 రాష్ట్ర రాజధానులు

కాబుల్‌: అఫ్గానిస్థాన్‌లో తాలిబన్లు పూర్తి ఆధితప్యం దిశగా దూసుకెళ్తున్నారు. శుక్రవారం కొత్తగా మరో నాలుగు రాష్ట్రాల రాజధానులను చేజిక్కించుకున్నారు. దీంతో దక్షిణ ప్రాంతం పూర్తిగా వారి ఆధిపత్యంలోకి వెళ్లిపోయింది. అమెరికా బలగాలు దేశం నుంచి వెళ్లింది మొదలు... తాలిబన్లు రెచ్చిపోతున్నారు. తాజాగా 24 గంటల వ్యవధిలోనే దేశంలో రెండో అతిపెద్ద నగరమైన హెరాత్‌ను, మూడో అతిపెద్ద నగరమైన కాందహార్‌ను తమ స్వాధీనంలోకి తెచ్చుకున్నారు. దేశంలోని రెండొంతులకు పైగా రాష్ట్రాలు వారి గుప్పెట్లోకి వెళ్లిపోయాయి. తిరుగుబాటుదారుల చేతుల్లోకి వెళ్లకుండా బ్రిటన్‌ సైనికులు ఏళ్ల తరబడి రక్షిస్తూ వచ్చిన హెల్మాండ్‌ సైతం ఇప్పుడు పూర్తిగా తాలిబన్ల చేతుల్లోకి వెళ్లిపోయింది. ప్రస్తుతం కాబుల్‌కు 80 కిలోమీటర్ల దూరంలో ప్రభుత్వ సైన్యానికి, తాలిబన్లకు మధ్య భీకర పోరు జరుగుతోంది.

దేశ భద్రత క్షీణిస్తున్న క్రమంలో... కాబుల్‌లోని తమ రాయబార కార్యాలయంలో తిష్టవేసిన వారిని బయటకు పంపేందుకు అమెరికా 3 వేల మంది సైన్యాన్ని పంపుతోంది. అఫ్గాన్‌లో చిక్కుకున్న తమ పౌరులను సురక్షితంగా వెనక్కు తీసుకెళ్లేందుకు 600 మంది సైన్యాన్ని పంపుతున్నట్టు బ్రిటన్‌ వెల్లడించింది. జర్మనీ, కెనడాలు సైతం కాబుల్‌లోని తమ రాయబార కార్యాలయాల నుంచి సిబ్బందిని వెనక్కు రప్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాయి.


తుపాకీ ప్రభుత్వాన్ని గుర్తించం: భారత్‌

ఫ్గానిస్థాన్‌లో తాలిబన్లు తుపాకీలతో రాజ్యాధికారం సాధించినా... వారు ఏర్పాటుచేసే ప్రభుత్వాన్ని గుర్తించరాదని భారత్‌, అమెరికా సహా 12 దేశాలు నిర్ణయించాయి. ఈ మేరకు ఆయా దేశాల ప్రతినిధులు ఖతార్‌లో సమావేశమై, నిర్ణయం తీసుకున్నారు.

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జనరల్

మరిన్ని