అనేక రాష్ట్రాల్లో డెల్టా ఉపరకం

ఇజ్రాయెల్‌లో తాజాగా కొవిడ్‌-19 కేసుల ఉద్ధృతికి కారణమవుతున్న డెల్టా వేయరింట్‌లోని ‘ఏవై.12’ అనే ఉపరకం భారత్‌లోని అనేక రాష్ట్రాల్లో కనిపిస్తోంది.

Published : 27 Aug 2021 05:40 IST

నిశిత పరిశీలన అవసరం: ఇన్సాకోగ్‌

దిల్లీ: ఇజ్రాయెల్‌లో తాజాగా కొవిడ్‌-19 కేసుల ఉద్ధృతికి కారణమవుతున్న డెల్టా వేయరింట్‌లోని ‘ఏవై.12’ అనే ఉపరకం భారత్‌లోని అనేక రాష్ట్రాల్లో కనిపిస్తోంది. ఈ కేసుల సంఖ్యపై మరింత నిశిత పరిశీలన అవసరమని దేశంలోని కరోనా జన్యుక్రమ ఆవిష్కరణ కన్సార్షియం (ఇన్సాకోగ్‌) పేర్కొంది. డెల్టా, ఏవై.12 మధ్య ఉన్న మార్పుల వల్ల తలెత్తే ప్రభావం ఏంటన్నది ఇంకా వెల్లడి కాలేదని తెలిపింది. అయితే పరమాణు స్థాయిలో ఆ రెండూ దాదాపుగా ఒకేలా ఉన్నాయని వివరించింది. ఏవై.12 ఉపరకం.. తన మాతృ రకమైన డెల్టాలో కనిపించే జీ142డీ సహా పలు ఉత్పరివర్తనలను కోల్పోయిందని తెలిపింది. అనేక దేశాల్లో డెల్టా వేరియంట్‌ వల్ల ఇప్పటికీ ఇన్‌ఫెక్షన్లు పెరుగుతున్నాయని వివరించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని