Published : 02/09/2021 04:37 IST

ఈవీఎంల విడుదలకు అనుమతించండి: ఈసీ వినతి

దిల్లీ: ఆరు రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించిన పిటిషన్ల దాఖలుకు గడువును కరోనా రెండో ఉద్ధృతి సమయంలో పొడిగించడం వల్ల పెద్దఎత్తున భద్రపరచాల్సి వచ్చిన ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాలు (ఈవీఎంలు), ఓటు రసీదు యంత్రాల (వీవీప్యాట్‌లు) విషయంలో అత్యవసర విచారణను చేపట్టాలని కేంద్ర ఎన్నికల సంఘం బుధవారం సుప్రీంకోర్టును కోరింది. అస్సాం, కేరళ, దిల్లీ, పుదుచ్చేరి, తమిళనాడు, పశ్చిమబెంగాల్‌లలో శాసనసభ ఎన్నికల నిమిత్తం వాడిన యంత్రాలను భద్రపరచాల్సి రావడంతో వాటిని వేరేచోట వాడే పరిస్థితి లేకుండా పోయిందని తెలిపింది. యూపీ, ఉత్తరాఖండ్‌, పంజాబ్‌లలో ఎన్నికలు దగ్గరపడుతున్నందువల్ల ఈ యంత్రాలు అవసరమవుతాయని పిటిషన్లో వివరించింది. దీనిపై వచ్చే వారం విచారణ చేపట్టడానికి భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్‌ ఎన్‌.వి.రమణ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం అంగీకరించింది. ఆ ఆరు చోట్ల వాడిన యంత్రాలపై ఏమైనా పిటిషన్లు ఉంటే దాఖలు చేయడానికి నిర్ణీత గడువును నిర్ణయించాలని ఈసీ తరఫున సీనియర్‌ న్యాయవాది వికాస్‌ సింగ్‌ కోరారు. ఎలాంటి పిటిషన్లు రాని నియోజకవర్గాల్లో వాడిన యంత్రాలనైనా తిరిగి వినియోగించుకునేలా విడుదల చేయాలని అభ్యర్థించారు.

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జనరల్

మరిన్ని