Tamil Nadu: రెండు డోసుల వ్యాక్సిన్‌ వేసుకుని ఉంటేనే మద్యం!

ఆధార్‌ కార్డు, కరోనా వ్యాక్సిన్‌ వేయించుకున్నట్లు ధ్రువీకరణ పత్రం ఉంటేనే మద్యం విక్రయించే విధానాన్ని మొదటిసారిగా తమిళనాడులోని నీలగిరి జిల్లాలో అమలు చేస్తున్నారు. కరోనా వ్యాప్తి నియంత్రణ చర్యల్లో భాగంగా..

Updated : 17 Aug 2022 11:27 IST

చెన్నై, న్యూస్‌టుడే: ఆధార్‌ కార్డు, రెండు డోసుల కరోనా వ్యాక్సిన్‌ వేయించుకున్నట్లు ధ్రువీకరణ పత్రం ఉంటేనే మద్యం విక్రయించే విధానాన్ని మొదటిసారిగా తమిళనాడులోని నీలగిరి జిల్లాలో అమలు చేస్తున్నారు. కరోనా వ్యాప్తి నియంత్రణ చర్యల్లో భాగంగా.. మద్యం కొనుగోలు చేయాలంటే ఆధార్‌ కార్డు, కరోనా టీకా పత్రం చూపాలని అధికారులు స్పష్టం చేశారు. జిల్లాలో 76 మద్యం దుకాణాలుండగా రోజూ రూ.కోటి విక్రయాలు జరుగుతున్నాయి. జిల్లాలో 18 ఏళ్లకు పైబడినవారు 5.82 లక్షల మంది ఉండగా ఇప్పటికే 70శాతం మందికి టీకాలు వేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని