ఫైజర్ టీకా తీసుకున్న 6 నెలలకు.. 80% తగ్గిపోతున్న యాంటీబాడీలు
ఫైజర్ వ్యాక్సిన్ రెండో డోసు తీసుకున్న ఆరు నెలల తర్వాత... ఆ టీకా ద్వారా శరీరంలో ఉత్పత్తయిన కొవిడ్ యాంటీబాడీలు 80% మేర తగ్గిపోతున్నట్టు తాజా అధ్యయనం వెల్లడించింది! కేస్ వెస్టర్న్ రిజర్వ్, బ్రౌన్ యూనివర్సిటీల
తాజా అధ్యయనంలో వెల్లడి
వాషింగ్టన్: ఫైజర్ వ్యాక్సిన్ రెండో డోసు తీసుకున్న ఆరు నెలల తర్వాత... ఆ టీకా ద్వారా శరీరంలో ఉత్పత్తయిన కొవిడ్ యాంటీబాడీలు 80% మేర తగ్గిపోతున్నట్టు తాజా అధ్యయనం వెల్లడించింది! కేస్ వెస్టర్న్ రిజర్వ్, బ్రౌన్ యూనివర్సిటీల శాస్త్రవేత్తలు సంయుక్తంగా దీన్ని చేపట్టారు. నర్సింగ్ హోమ్స్‌లో ఉంటున్న 120 మంది నివాసులు, 92 మంది ఆరోగ్య కార్యకర్తల నుంచి వారు రక్త నమూనాలను సేకరించారు. వాటిలో కరోనా యాంటీబాడీల స్థాయుల్ని లెక్కించారు. వాలంటీర్లంతా ఫైజర్ సంస్థ తయారుచేసిన వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్నవారే. ‘‘టీకా తీసుకున్న 6 నెలల తర్వాత సార్స్-కొవ్-2 ప్రతినిరోధకాలు 80% మేర తగ్గిపోతున్నాయి. ఈ తగ్గుదల అందరిలోనూ ఒకేలా ఉంటోంది. నర్సింగ్ హోమ్స్ నివాసుల్లో 70% మందికి కరోనా వైరస్‌ను ఎదుర్కొనేంత స్థాయిలో యాంటీబాడీలు ఉండటం లేదు’’ అని పరిశోధనకర్త డేవిడ్ కెనడే చెప్పారు. డెల్టా రకం వైరస్ విజృంభిస్తున్నందున బూస్టర్ డోసు ఆవశ్యకతను తమ అధ్యయనం వెల్లడిస్తోందన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Chandra babu arrest: తెలంగాణలో లేని ఆంక్షలు ఏపీలోనే ఎందుకు: నారా లోకేశ్
-
Drugs Case: ఏడేళ్ల క్రితం కాల్ లిస్ట్ ఆధారంగా విచారించారు: సినీనటుడు నవదీప్
-
Keerthy suresh: ముంబయి వీధుల్లో ఆటోరైడ్ చేస్తున్న కీర్తి సురేశ్.. వీడియో వైరల్
-
Chandrababu Arrest: తొలి రోజు ముగిసిన చంద్రబాబు సీఐడీ విచారణ
-
Team India: ర్యాంకులు ముఖ్యం కాదు.. బలమైన జట్లను ఓడిస్తేనే.. ప్రపంచకప్: గౌతమ్ గంభీర్
-
Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు