అత్యవసర వైద్య భద్రతా వ్యవస్థల బలోపేతానికి అధిక ప్రాధాన్యం

కరోనా వైరస్‌ వంటి విపత్తులు సంభవించిన సమయంలో వాటిని సమర్థమంతంగా ఎదుర్కొనేందుకు అత్యవసర వైద్య భద్రతా వ్యవస్థలను పటిష్టం చేసుకోవాల్సిన

Published : 10 Sep 2021 06:09 IST

ఆగ్నేయాసియా ప్రాంత సదస్సులో నిర్ణయం: డబ్ల్యూహెచ్‌వో

కాఠ్‌మాండూ: కరోనా వైరస్‌ వంటి విపత్తులు సంభవించిన సమయంలో వాటిని సమర్థమంతంగా ఎదుర్కొనేందుకు అత్యవసర వైద్య భద్రతా వ్యవస్థలను పటిష్టం చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో), ఆగ్నేయాసియాలోని దాని సభ్య దేశాలు నిర్ణయించాయి. భవిష్యత్తులో ఆరోగ్య రంగంలో ఎటువంటి ఆకస్మిక సవాళ్లనైనా తిప్పికొట్టేలా సన్నద్ధంగా ఉండాలనీ అభిప్రాయపడ్డాయి. డబ్ల్యూహెచ్‌వో, ఆగ్నేయాసియా దేశాల 74వ ప్రాంతీయ కమిటీ సమావేశాలు గురువారం నేపాల్‌ రాజధాని కాఠ్‌మాండూలో జరిగాయి. ఆ వివరాలను డబ్ల్యూహెచ్‌వో ఆగ్నేయాసియా రీజనల్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ పూనమ్‌ ఖేత్రపాల్‌ సింగ్‌ ఒక ప్రకటన ద్వారా వెల్లడించారు. ప్రపంచ దేశాలకు కొవిడ్‌ అనూహ్యమైన సవాల్‌ను విసిరిందని, ఏ ఒక్క దేశం కూడా పూర్తి స్థాయిలో ఎదుర్కోలేకపోయిందని తెలిపారు. దీనిని నుంచి గుణపాఠాలు నేర్చుకొని వైద్య భద్రతా వ్యవస్థలను బలోపేతం చేసుకోవాలని నిర్ణయించినట్లు ఖేత్రపాల్‌ సింగ్‌ తెలిపారు.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts