Coronavirus: కరోనాకు కేరాఫ్‌గా మారిన ‘క్రెమ్లిన్‌’

రష్యా అధ్యక్ష భవనం ‘క్రెమ్లిన్‌’ కరోనా వైరస్‌కు కేరాఫ్‌ అడ్రస్‌గా మారింది. ఈ విషయాన్ని అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ స్వయంగా వెల్లడిస్తూ.. సిబ్బందిలో డజన్లకొద్దీ ఈ మహమ్మారి బారినపడటంతో

Updated : 17 Sep 2021 07:05 IST

రష్యా అధ్యక్షుడు పుతిన్‌ వెల్లడి

మాస్కో: రష్యా అధ్యక్ష భవనం ‘క్రెమ్లిన్‌’ కరోనా వైరస్‌కు కేరాఫ్‌ అడ్రస్‌గా మారింది. ఈ విషయాన్ని అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ స్వయంగా వెల్లడిస్తూ.. సిబ్బందిలో డజన్లకొద్దీ ఈ మహమ్మారి బారినపడటంతో తన స్వీయ ఏకాంతవాసాన్ని కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు. స్వదేశీ వ్యాక్సిన్‌ స్పుత్నిక్‌ వి. రెండు డోసులూ తీసుకొన్న పుతిన్‌కు కరోనా పరీక్షల్లో నెగెటివ్‌ వచ్చినప్పటికీ, సిబ్బందిలో కొద్దిమందికి పాజిటివ్‌ రావడంతో మూడు రోజుల కిందట ఆయన స్వీయ ఏకాంత వాసంలోకి వెళ్లిన విషయం తెలిసిందే. తాజాగా ఈ ఇన్ఫెక్షన్‌ మరింత పెరిగినట్లు రష్యా నేతృత్వంలోని సమష్టి ఒప్పంద భద్రతాసంస్థ సదస్సులో గురువారం వీడియో లింక్‌ ద్వారా మాట్లాడుతూ పుతిన్‌ తెలిపారు. పరిస్థితి అదుపులోనే ఉందని క్రెమ్లిన్‌ అధికార ప్రతినిధి చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు