అన్ని వేరియంట్లు లక్ష్యంగా బూస్టర్‌ టీకా

కరోనాలో పుట్టుకొస్తున్న అనేక రకాల వేరియంట్లను లక్ష్యంగా చేసుకోగల ‘మల్టీవేరియంట్‌’ బూస్టర్‌ టీకా బ్రిటన్‌లో సిద్ధమైంది. 60 ఏళ్లు పైబడ్డవారిపై దీన్ని పరీక్షిస్తున్నారు.

Published : 22 Sep 2021 09:22 IST

లండన్‌: కరోనాలో పుట్టుకొస్తున్న అనేక రకాల వేరియంట్లను లక్ష్యంగా చేసుకోగల ‘మల్టీవేరియంట్‌’ బూస్టర్‌ టీకా బ్రిటన్‌లో సిద్ధమైంది. 60 ఏళ్లు పైబడ్డవారిపై దీన్ని పరీక్షిస్తున్నారు. జీఆర్‌టీ-ఆర్‌910 అనే ఈ టీకాపై ఔషధ కంపెనీ గ్రిట్‌స్టోన్‌, మాంచెస్టర్‌ వర్సిటీ సంయుక్తంగా పరీక్షలు మొదలుపెట్టాయి. కొవిడ్‌కు సంబంధించి రూపొందిన మొదటితరం టీకాల ద్వారా వెలువడిన రోగనిరోధక స్పందనను ఇది పెంచగలదా, కరోనాలోని వేరియంట్లను నిలువరించలదా అన్నది ఇందులో తేల్చనున్నారు. వయోధికులను తీవ్రస్థాయి కొవిడ్‌, మరణం ముప్పు నుంచి తప్పించేందుకు ఈ బూస్టర్‌ టీకా అవసరమని పరిశోధకులు తెలిపారు. ‘‘మొదటి తరం కొవిడ్‌ టీకాలకు స్పందనగా వెలువడిన రోగ నిరోధక స్పందన తరిగిపోతుందని మనకు తెలుసు. వైరస్‌లో కొత్త వేరియంట్లు వస్తున్న నేపథ్యంలో అప్రమత్తత అవసరం’’ అని అధ్యయనంలో పాల్గొంటున్న ఆండ్రూ ఉస్తియానోస్కీ తెలిపారు. జీఆర్‌టీ-ఆర్‌910 రెండోతరం ఎంఆర్‌ఎన్‌ఏ టీకా అని చెప్పారు. ఇది కరోనాలోని స్పైక్‌, ఇతర ప్రొటీన్లకు సంబంధించిన యాంటిజెన్లను శరీరంలోకి చొప్పిస్తుందని తెలిపారు. రోగనిరోధక వ్యవస్థకు సంబంధించిన సిడీ8+టి కణ స్పందనలను మెరుగుపరుస్తుందన్నారు. అలాగే యాంటీబాడీలనూ ఉత్పత్తి చేస్తుందన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు