Corona vaccine: కొవిడ్‌ టీకాతో.. మూత్రపిండాల రోగులకు రక్ష

కొవిడ్‌ టీకా తీసుకున్న డయాలసిస్‌ రోగుల్లో ఇన్‌ఫెక్షన్‌ ముప్పు 33 శాతం తగ్గినట్లు తాజా అధ్యయనంలో తేలింది. డయాలసిస్‌ నెట్‌వర్క్‌ సంస్థ ‘నెఫ్రోప్లస్‌’ దేశవ్యాప్తంగా 150 పట్టణాలు,

Updated : 24 Sep 2021 07:04 IST

నెఫ్రోప్లస్‌ సంస్థ అధ్యయనం

ఈనాడు, హైదరాబాద్‌: కొవిడ్‌ టీకా తీసుకున్న డయాలసిస్‌ రోగుల్లో ఇన్‌ఫెక్షన్‌ ముప్పు 33 శాతం తగ్గినట్లు తాజా అధ్యయనంలో తేలింది. డయాలసిస్‌ నెట్‌వర్క్‌ సంస్థ ‘నెఫ్రోప్లస్‌’ దేశవ్యాప్తంగా 150 పట్టణాలు, నగరాల్లో 32,235 మంది డయాలసిస్‌ రోగులపై ఇటీవల అధ్యయనం చేసి గురువారం నివేదికను వెల్లడించింది. సాధారణ జనాభాలో కరోనా వ్యాప్తి రేటు 0.44 శాతం ఉంటే.. డయాలసిస్‌ రోగుల్లో 8.7 శాతం ఉన్నట్లు తెలిపింది. ‘‘కొవిడ్‌ కారణంగా డయాలసిస్‌ రోగుల మరణాలు మొదటి దశ ఉద్ధృతిలో 5% పెరిగినట్లు గుర్తించాం. రెండో విడతలో చాలామంది ఇన్‌ఫెక్షన్‌కు గురైనప్పటికీ టీకా తీసుకోవడం వల్ల బయట పడ్డారు. బీపీ, షుగర్‌, మూత్రపిండాల వైఫల్యం వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్‌ తీసుకోవడం అనివార్యం. ఒకవేళ వైరస్‌ బారిన పడినా.. తీవ్రమైన ఇన్‌ఫెక్షన్‌ ముప్పు తప్పుతుంది. ఒక డోసు తీసుకున్న వారు సైతం ముప్పు నుంచి బయట పడినట్లు అధ్యయనంలో గుర్తించాం’’ అని సంస్థ ప్రతినిధులు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని