Delta variant: డెల్టాతో పిల్లలకు తీవ్ర ముప్పేమీ లేదు!
ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో కంటిమీద కునుకులేకుండా చేస్తున్న డెల్టా రకం కరోనా వైరస్ వల్ల చిన్నారులకు ప్రమాదకరమా? అమెరికా నిపుణులు మాత్రం దీనిపై
వాషింగ్టన్: ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో కంటిమీద కునుకులేకుండా చేస్తున్న డెల్టా రకం కరోనా వైరస్ వల్ల చిన్నారులకు ప్రమాదకరమా? అమెరికా నిపుణులు మాత్రం దీనిపై బలమైన ఆధారాలేమీ లేవంటున్నారు. కరోనాలోని మునుపటి వేరియంట్లతో పోలిస్తే డెల్టా వల్ల చిన్నారులు, కౌమారప్రాయులు తీవ్రస్థాయిలో అనారోగ్యం పాలవుతారని వెల్లడి కాలేదని చెప్పారు. అయితే అధిక సాంక్రమిక శక్తిని కలిగి ఉండటం వల్ల ఈ రకం వైరస్‌తో పిల్లల్లో ఇన్‌ఫెక్షన్లు పెరిగాయని తెలిపారు. అందువల్ల పాఠశాలల్లో వీరు తప్పనిసరిగా మాస్కులు ధరించాల్సి ఆవశ్యకత ఉందని పేర్కొన్నారు. కొవిడ్-19 మొదలైనప్పటి నుంచి అమెరికాలో 50 లక్షల మందికిపైగా చిన్నారులు ఈ మహమ్మారి బారినపడ్డారు. ఆగస్టు చివర్లో, సెప్టెంబరు మొదట్లో ఈ వ్యాధితో ఆసుపత్రిపాలైన చిన్నారుల సంఖ్య.. గత ఏడాది శీతాకాలంలో కరోనా మహమ్మారి ఉద్ధృతంగా ఉన్నప్పటి స్థాయిలోనే ఉందని సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) తెలిపింది. వీరిలోనూ ఎక్కువ మందికి స్వల్పస్థాయి లక్షణాలే ఉన్నాయని పేర్కొంది. వాస్తవానికి వారిని ఆసుపత్రిలో చేర్చాల్సిన అవసరం లేదని తెలిపింది. దీన్నిబట్టి డెల్టాతో పిల్లలకు కొత్తగా పెరిగిన ముప్పేమీ లేదని శాస్త్రవేత్తలు వివరించారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
పాక్ మీడియాలో ఇమ్రాన్ కనిపించరు.. వినిపించరు
-
Ap-top-news News
9వ తేదీ వరకు పలు రైళ్ల రద్దు: విజయవాడ రైల్వే అధికారులు
-
India News
క్రికెట్ బుకీని ఫోన్‌కాల్స్‌తో పట్టించిన అమృతా ఫడణవీస్
-
India News
సోదరి కులాంతర వివాహం.. బైక్‌పై వచ్చి ఎత్తుకెళ్లిన అన్న
-
India News
సికింద్రాబాద్ - అగర్తలా రైలులో షార్ట్ సర్క్యూట్
-
Movies News
స్నేహితుల మధ్య ప్రేమ మొదలైతే..