మరింత సెన్సార్‌షిప్‌ దిశగా డ్రాగన్‌

ఇంటర్నెట్‌ సమాచార సేవలకు సంబంధించిన అల్గారిథమ్‌లను ప్రభుత్వ నియంత్రణలోకి తెచ్చేందుకు ఉద్దేశించిన మూడేళ్ల ప్రణాళికను చైనా బుధవారం ఆవిష్కరించింది. ఈ మేరకు

Published : 30 Sep 2021 04:46 IST

 ఇంటర్‌నెట్‌ పరిశ్రమ అల్గారిథమ్‌లు ప్రభుత్వ నియంత్రణలోకి

మూడేళ్ల ప్రణాళికను ఆవిష్కరించిన చైనా

బీజింగ్‌: ఇంటర్నెట్‌ సమాచార సేవలకు సంబంధించిన అల్గారిథమ్‌లను ప్రభుత్వ నియంత్రణలోకి తెచ్చేందుకు ఉద్దేశించిన మూడేళ్ల ప్రణాళికను చైనా బుధవారం ఆవిష్కరించింది. ఈ మేరకు ఇంటర్నెట్‌ సమాచార సేవలకు సంబంధించిన అల్గారిథమ్‌ల నిర్వహణను చైనా నియంత్రణ సంస్థలు బలోపేతం చేయనున్నట్లు జిన్హువా వార్తా సంస్థ తెలిపింది. చైనా సైబర్‌ స్పేస్‌ పరిపాలన విభాగం సహా తొమ్మిది విభాగాలు కొత్త మార్గదర్శకాలు జారీచేశాయి. శాస్త్ర సాంకేతిక రంగాల్లో విలువల సమీక్ష వ్యవస్థలు, అల్గారిథమ్‌ భద్రత వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవాలని, తమ బాధ్యతలను మరింత సమర్థంగా నిర్వర్తించాలని వాణిజ్య సంస్థలను కోరాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని