ప్రతి జిల్లాకూ ఒక వైద్య కళాశాల

వైద్య సేవల అవసరాలు, వైద్య విద్య మధ్య ఉన్న అంతరాన్ని తగ్గించేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ఆరోగ్య సంరక్షణలో ముందస్తు చర్యల్లో భాగంగా ఆయుర్వేదం...

Published : 01 Oct 2021 04:56 IST

ఆ దిశగా కేంద్ర ప్రభుత్వం కృషి: ప్రధాని మోదీ

జైపుర్‌: వైద్య సేవల అవసరాలు, వైద్య విద్య మధ్య ఉన్న అంతరాన్ని తగ్గించేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ఆరోగ్య సంరక్షణలో ముందస్తు చర్యల్లో భాగంగా ఆయుర్వేదం, యోగ వంటివాటిని ప్రోత్సహిస్తున్నామని వెల్లడించారు. దేశంలోని ప్రతి జిల్లాలోనూ కనీసంగా ఒక వైద్య కళాశాల లేదా పీజీ వైద్య విద్యను అందించే సంస్థ ఉండేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని వివరించారు. దీనిలో భాగంగానే గత ఆరు సంవత్సరాల్లో దేశంలో 170 వైద్య కళాశాలల నిర్మాణం పూర్తయ్యిందని, మరో 100కు పైగా వైద్య కళాశాలల నిర్మాణం వేగంగా కొనసాగుతోందని చెప్పారు. రాజస్థాన్‌లో గురువారం వర్చువల్‌ విధానంలో నాలుగు వైద్య కళాశాలలకు శంకుస్థాపన చేయడంతో పాటు ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ పెట్రోకెమికల్స్‌ టెక్నాలజీని ఆయన ప్రారంభించారు. అనంతరం ప్రసంగిస్తూ తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేనాటికి దేశంలో ఆరు ఎయిమ్స్‌లు మాత్రమే ఉన్నాయని, వాటి సంఖ్యను 22కి పెంచామన్నారు. 2014లో దేశవ్యాప్తంగా వైద్య విద్యలో గ్రాడ్యుయేట్‌, పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ సీట్లు 82వేలు మాత్రమేనని, ఇప్పుడు వాటి సంఖ్య 1.40లక్షలకు చేరిందని వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని